అంచనాలు మించిన ఇన్ఫోసిస్‌: లాభాలు, ఆదాయం జంప్‌

Infosys Q3 profit jumps13pc and revenue rise 20pc - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌  క్యూ3లో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది.  డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో లాభాలను సాధించింది. ఈ క్వార్టర్‌లో ఏకీకృత నికర లాభం 13.4 శాతం పెరిగి రూ.6,586 కోట్లకు చేరుకుంది.గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,809 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.లాభం గత త్రైమాసికంలో  రూ. 6,021 కోట్లతో పోలిస్తే  9 శాతం పెరిగింది

అలాగే  గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.31,867 కోట్లతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం 20.2 శాతం పెరిగి రూ.38,318 కోట్లగా నమోదైంది. ఇన్ఫోసిస్ తన 2023  ఆర్థిక సంవత్సర ఆదాయ మార్గదర్శకాన్ని(రెవెన్యూ గైడెన్స్‌) 16.0-16.5 శాతానికి పెంచింది. అలాగే   ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 21-22శాతంగా   ఆదాయ ఫలితాల సందర్భంగా ఇన్పీ  గురువారం ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top