ఇన్ఫోసిస్‌ సంచలనం నిర్ణయం! ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..!

Infosys Has Laid Out A Three Phase Plan To Get Them Back To Offices - Sakshi

టెక్కీలకు ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చే పనిలేకుండా..వారి కంఫర్ట్‌కు అనుగుణంగా కొత్త వర్క్‌ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చేలా సంచలన నిర్ణయం తీసుకుంది.   

ఏప్రిల్‌13న ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ క్యూ4 ఫలితాల్ని విడుదల చేసింది. ఈ ఫలితాల్ని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇన్ఫోసిస్‌లో మొత్తం 3,14,105 మంది ఉద్యోగులు అంటే 95శాతం మంది వర్క్‌ఫ్రమ్‌ నుంచి విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు వారిని పూర్తిస్థాయిలో ఆఫీస్‌లో వర్క్‌ చేసేలా 3 పద్దతుల్ని అవలంభిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా ఫస్ట్‌ ఫేస్‌లో ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు.. ఆఫీస్‌కు వచ్చే పనిలేకుండా వారి ప్రాంతాల్లో సంస్థ(ఇన్ఫోసిస్‌) డెవలప్‌మెంట్‌ సెంటర్‌(డీసీ)లను ఏర్పాటు చేయనుంది. ఈ డీసీ సెంటర్లకు ఉద్యోగులు కనీసం వారానికి రెండు సార్లు వచ్చేలా ఎంకరేజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. 

ఇక సెకండ్‌ ఫేజ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో డీసీ సెంటర్లను ఏర్పాటు చేయలేమని, అలా డీసీ సెంటర్ల ఏర్పాటు చేయలేని ప్రాంతాల ఉద్యోగులు మరికొన్ని రోజుల్లో తిరిగి కార్యాలయాలకు వచ్చేలా సన్నద్ధం అవ్వాలని, అది వారి వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నీలంజన్ రాయ్ పేర్కొన్నారు. 

మూడో ఫేజ్‌లో ఉద్యోగుల కోసం హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. అయితే ఈ వర్క్‌ మోడల్‌ క్లయింట్‌ రిక్వెరైమెంట్‌కు అనుగుణంగా ఉంటుందని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్ పేర్కొన్నారు.

చదవండి: ప్రమోషన్లు వద్దంటున్న ఉద్యోగులు ! కారణం తెలిస్తే షాకవుతారు?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top