సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ.. | Sakshi
Sakshi News home page

సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ..

Published Sat, Dec 9 2023 3:25 PM

Infosys co founder Narayan Murthys wife Sudha Murty to join politics makes big remarks - Sakshi

ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్, ప్రముఖ రచయిత్రి 'సుధామూర్తి' (Sudha Murthy) ఇటీవల కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా.. లేదా అనే విషయాన్ని గురించి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సుధా మూర్తి కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించి, భవన నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని.. కళ,  సంస్కృతి, భారతీయ చరిత్ర మొత్తం ఉట్టిపడేలా ప్రతిదీ చాలా అందంగా ఉన్న ఈ నిర్మాణం గురించి చెప్పడానికి మాటలు చాలవని తెలిపింది. అంతే కాకుండా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించడం తన కల అని.. ఆ కల ఇప్పటికి నిజమైందని విలేకరులతో వెల్లడించింది.

ఈ సందర్భంగా విలేకరులు మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని సుధా మూర్తిని ప్రశ్నించారు. విలేకరుల ప్రశ్నకు నవ్వుతూ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని.. రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి: ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు

సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్‌లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తన కోడలు గురించి ప్రస్తావిస్తూ అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులకు ముందు అపర్ణ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement