ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు

Published Fri, Dec 8 2023 10:07 AM

RBI Cancels Licence One More Bank - Sakshi

గత కొన్ని రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రూల్స్ అతిక్రమించిన బ్యాంక్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం.. లేదా భారీ జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లోని అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను ఆర్‌బీఐ క్యాన్సిల్ చేసింది. ఈ బ్యాంకుకు సరైన ఆదాయం లేకపోవడమే కాకుండా.. ఆదాయ మార్గాలు వచ్చే అవకాశాలు కూడా బాగా క్షిణించడంతో RBI ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడంతో లావాదేవీలన్నీ కూడా వెంటనే నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అయితే కస్టమర్లు ఆందోళన చెందకుండా ఉండటానికి ప్రతి డిపాజిటర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి రూ.5 లక్షల బీమా క్లెయిమ్ స్వీకరించడానికి అర్హులని వెల్లడించింది.

ఇదీ చదవండి: రంగంలోకి గూగూల్‌ ఏఐ ‘జెమినీ’.. పూర్తి వివరాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటి సారి కాదు, గత కొన్ని రోజులకు ముందు కొల్లాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్ రద్దు చేస్తూ ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్‌ఎ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌ వంటి వాటికి భారీ జరిమానాలు విధించింది.

Advertisement
 
Advertisement