బలహీనంగానే సెంటిమెంట్‌ | Sakshi
Sakshi News home page

బలహీనంగానే సెంటిమెంట్‌

Published Mon, Oct 30 2023 6:22 AM

Indian stocks that may be affected by Middle East crisis says Experts - Sakshi

ముంబై: స్టాక్‌ సూచీలు ఈ వారంలోనూ బలహీనంగానే కదలాడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పరిమిత శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌ ఉండొచ్చంటున్నారు. ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య విధాన నిర్ణయాలు, ఇజ్రాయిల్‌ పాలస్తీనా యుద్ధ పరిణామాలు, దేశీయ కార్పొరేట్‌ క్యూ2 ఆరి్థక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు, డాలర్‌ మారకంలో రూపాయి ట్రేడింగ్, క్రూడాయిల్‌ ధరల కదిలికలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు.
 
పశి్చమాసియా ఉద్రిక్తతలు, బాండ్లపై రాబడులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, మిశ్రమ కార్పొరేట్‌ ఆరి్థక ఫలితాల వెల్లడి తదితర పరిణామాల నేపథ్యంలో క్రితం వారం సూచీలు రెండున్నరశాతం నష్టపోయాయి. ట్రేడింగ్‌ నాలుగురోజులు జరిగిన గతవారంలో సెన్సెక్స్‌ 1,615 పాయింట్లు, నిఫ్టీ 495 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.  

‘‘వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ఆస్థిరత కొనసాగవచ్చు. ఈ పరిణామం దేశీయ ఈక్విటీ రికవరీని ఆలస్యం చేయోచ్చు. ఇటీవల వరుస విక్రయాలతో నెలకొన్న ఓవర్‌సోల్డ్‌ ట్రెండ్‌తో నిఫ్టీ పతనం తాత్కాలికంగా ఆగింది. నిఫ్టీకి సాంకేతికంగా కీలకమైన మద్దతు 19,250 స్థాయి కోల్పోయింది.
తిరిగి ఈ స్థాయిపైకి చేరుకుంటేనే  ముందుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు రూపక్‌ తెలిపారు.

క్యూ2 కార్పొరేట్‌ ఫలితాలు  
గత వారాంతంలో ఎన్‌టీపీసీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, యూపీఎల్‌లు వెల్లడించిన ఆరి్థక ఫలితాలకు స్టాక్‌ మార్కెట్‌ ముందుగా స్పందించాల్సి ఉంటుంది. ఇక నిఫ్టీ సూచీలో లిస్టైన టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, సన్‌ ఫార్మా, హీరో మోటోకార్ప్, టైటాన్, యూపీఎల్, టాటా కన్జూమర్‌ ప్రొడెక్టŠస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బ్రిటానియాతో పాటు ఇరు ఎక్సే్చంజీల్లో దాదాపు 700 కంపెనీలు వచ్చే వారం తమ క్యూ2 ఆరి్థక ఫలితాలను వెల్లడించనున్నాయి. గెయిల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, మనోజ్‌ వైభవ్‌ జెమ్స్, యధార్థ్‌ హాస్పిటల్స్, గ్లాండ్‌ ఫార్మా, ఐఓసీ, అంజుజా సిమెంట్స్, టీవీఎస్, ఇండిగో, జొమోటో, డెల్హవరీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, డీఎల్‌ఎఫ్‌ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌ జరగొచ్చు. ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం వెల్లడించే అవుట్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి.

స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం  
సెపె్టంబర్‌ ద్రవ్యలోటు, ఎనిమిది కీలక రంగాల వృద్ధి డేటా మంగళవారం(అక్టోబర్‌ 31న), అక్టోబర్‌ తయారీ రంగ పీఎంఐ, ఇదే నెల ఆటో అమ్మకాలు బుధవారం, సేవా రంగ పీఎంఐ డేటా, పారెక్స్‌ నిల్వలు శుక్రవారం విడుదల అవుతాయి. అమెరికా తయారీ, సేవా రంగ పీఎంఐ, ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్‌ ఎకానామిక్‌ కాని్ఫడెన్స్, కన్జూమర్‌ కాని్ఫడెన్స్, సీపీఐ, జీడీపీ, తయారీ రంగ గణాంకాలు ఇదే వారంలో విడుదల కానున్నాయి. చైనా తయారీ, నాన్‌ మాన్యూఫ్యాక్చరింగ్, సేవారంగ పీఎంఐ డేటా ఈ వారంలోనే వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబింజేసే కీలక స్థూల ఆరి్థక గణాంకాల వెల్లడికి ముందు మార్కెట్లలో అప్రమత్తత చోటు చేసుకోనే వీలుంది.  

అక్టోబర్‌లో రూ.20 వేల కోట్లు వెనక్కి
► విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో రూ.20,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్‌– హమాస్‌ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. ఇదే కాలంలో డెట్‌ మార్కెట్‌లో రూ.6,080 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. ఫెడ్‌ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి తర్వాత భారత మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి ఏమిటనేది స్పష్టమవుతుంది. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్‌ గూడ్స్‌ ఆటోమొబైల్స్‌ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు.  
రేపు ఎఫ్‌ఓఎంసీ సమావేశం ప్రారంభం

► ద్రవ్య విధాన నిర్ణయాలు, వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ మంగళ, బుధవారాల్లో సమావేశం కానుంది. ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను 5.25 – 5.50% వద్ద యథాతథంగా ఉంచొచ్చని ఆరి్థకవేత్తల అంచనా. ద్రవ్య పాలసీ వెల్లడి సందర్భంగా చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యలను ఈక్విటీ మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ఇదే మంగళ, బుధవారాల్లో బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌లు సైతం ద్రవ్య సమీక్ష నిర్వహించనున్నాయి. 

Advertisement
Advertisement