ప్యాసింజర్‌ రైళ్లలో ‘సెకండ్‌ క్లాస్‌’ రిజర్వేషన్లు.. తక్కువ దూరం అయినా అదే మోత!

Indian Railways continue reservation For passenger trains second class Journey - Sakshi

Indian Railways continue To reservations For passenger trains second class Journey: సెకండ్‌ క్లాస్‌ ప్రయాణాలను రిజర్వేషన్‌ కేటగిరీలో కొనసాగించడంపై  రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. సామాన్యుడికి రిజర్వేషన్‌ ఛార్జీల భారం తప్పదని పరోక్షంగా తేల్చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ప్యాసింజర్‌ రైళ్లలో  ద్వితియ శ్రేణి తరగతిలో ప్రయాణాలకు ‘రిజర్వేషన్‌’ కొనసాగుతుందని పార్లమెంట్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటన చేశారు. 

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎదురైన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. కరోనా ఫస్ట్‌ ఫేజ్‌ తర్వా తి సడలింపులతో భారతీయ రైల్వే శాఖ ‘కొవిడ్‌ స్పెషల్‌’ పేరిట ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆ టైంలో ప్యాసింజర్‌ రైళ్లను మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా, పండుగ స్పెషల్‌గా మార్చేసి ఎక్కువ ఛార్జీలతో రైళ్లను నడిపించింది భారతీయ రైల్వేస్‌. పైగా సెకండ్‌ క్లాస్‌ సహా  అన్ని కేటగిరీలను రిజర్వేషన్‌ కోటాలోకి మార్చేసింది. అయితే..

తాజాగా కొవిడ్‌ స్పెషల్‌ కేటగిరీని ఎత్తేస్తూ.. రెగ్యులర్‌ సర్వీసులుగా వాటిని మార్చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. దీంతో టికెట్‌ రేట్లు తగ్గుతాయని,  సామాన్యుడికి ఊరట లభించిందని, ప్యాసింజర్‌ రైళ్లు ప్రయాణికుల కోలాహలంతో పూర్వవైభవం సంతరించుకోవచ్చని భావించారంతా. కానీ,. అనూహ్యంగా ప్యాసింజర్‌ రైళ్లలో సెకండ్‌క్లాస్‌ ప్రయాణాలకు ఇంకా రిజర్వేషన్‌ కేటగిరీ కిందే కొనసాగుతోంది. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు రైల్వే మంత్రి పార్లమెంట్‌లో బదులిచ్చారు.  

ప్యాసింజర్‌ రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ ప్రయాణాలకు, ప్రయాణికులు రిజర్వేషన్‌ బుకింగ్‌ చేసుకోవాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసర లేదంటే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే మాత్రం.. కొన్ని రైళ్లకు మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీంతో రిజర్వేషన్‌ ఛార్జీల రూపంలో సామాన్యుడికి మోత మోగనుంది. అంతేకాదు తక్కువ దూరం ప్రయాణాలైనా సరే.. రిజర్వేషన్‌ కింద భారం మోయాల్సి వస్తుంది. 

ఇదిలా ఉంటే రవాణాశాఖ నివేదికల ప్రకారం.. 364 ప్యాసింజర్‌ రైళ్లను 2020-2021 ఏడాది మధ్య ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులుగా మార్చేసి నడిపించింది రైల్వే శాఖ.  సెకండ్‌ క్లాస్‌ కేటగిరీలో సగటున రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా.

సింగిల్‌ క్లిక్‌తో 35పై.లకే 10 లక్షల ఇన్సూరెన్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top