నైపుణ్యాలను పెంచుకుంటాం | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలను పెంచుకుంటాం

Published Thu, Apr 27 2023 2:40 AM

Indian Professionals Consider Upskilling Important For Their Careers - Sakshi

న్యూఢిల్లీ: కెరీర్‌ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకునేందుకు మన దేశంలో ఎక్కువ మంది నిపుణులు సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఎడ్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ ‘గ్రేట్‌ లెర్నింగ్‌’ ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించి నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా చూస్తే నైపుణ్యాల పెంపు విషయంలో భారత్‌లోనే ఎక్కువ మంది సానుకూల ధోరణితో ఉన్నారు.

అలాగే, తమ ఉద్యోగాలను కాపాడుకోగలమని భారత్‌లో 71% మంది నిపుణులు చెప్పగా, అంతర్జాతీయంగా ఇలా చెప్పిన వారు 59 శాతంగానే ఉన్నారు. అంటే భారత్‌లోనే ఎక్కువ మంది ఉద్యోగ భద్రత విషయంలో నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. నైపుణ్యాల పెంపు, ఈ దిశగా వారిని ప్రేరేపించే అంశాలు, నైపుణ్యాలను పెంచుకోకుండా అడ్డుపడే అంశాలు, కార్యాలయాలు తిరిగి తెరవడం వల్ల నైపుణ్యాల పెంపుపై ప్రభావం గురించి గ్రేట్‌ లెర్నింగ్‌ సంస్థ తన నివేదికలో వివరాలు వెల్లడించింది.

సర్వే అంశాలు..  
► మన దేశంలో 85 శాతం మంది నిపుణులు అదనపు నైపుణ్యాలు సంపాదించడం ద్వారా తమ కెరీర్‌లో భవిష్యత్తు అవసరాలకు సన్నద్ధంగా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ, అంతర్జాతీయంగా చూస్తే 76 శాతం మంది ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  
► ఆగ్నేయాసియా దేశాల నుంచి 84 శాతం మంది, ల్యాటిన్‌ అమెరికా నుంచి 76 శాతం మంది నిపుణులు అదనపు నైపుణ్యాల ప్రాముఖ్యాన్ని తెలియజేశారు.  
► అభివృద్ధి చెందిన అమెరికాలో తమ కెరీర్‌ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను సముపార్జించుకుంటామని కేవలం 64 శాతం మంది చెప్పగా, మధ్య ప్రాచ్యం నుంచి 66 శాతం మంది ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  
► 2023లోనే తాము నైపుణ్యాలను పెంచుకుంటామని 83 శాతం మంది భారతీయులు చెప్పగా, అంతర్జాతీయంగా 74 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని తెలియజేశారు.  
► 71 శాతం మంది భారతీయ నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకుంటామని చెప్పగా, అంతర్జాతీయంగా 59 శాతం మంది ఈ విధమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
► మన దేశంలో 71 శాతం మంది నిపుణులు ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగుతామని చెప్పారు. అంతర్జాతీయంగా ఇలా చెప్పిన వారు 59 శాతంగా ఉన్నారు.  
► అమెరికాలో 59 శాతం మంది నిపుణులు ఉద్యోగ భద్రతను ప్రదర్శించారు. ఆగ్నేయాసియాలో ఇది 60 శాతంగా ఉంది.

నేర్చుకోవడానికి సిద్ధం
మెజారిటీ ఉద్యోగుల మనోగతం
పియర్సన్‌ స్కిల్‌ అవుట్‌లుక్‌ సర్వేలో వెల్లడి

తమ కెరీర్‌ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు తాము కెరీర్‌ అంతటా నేర్చుకునేందుకు, శిక్షణ తీసుకునేందుకు సుముఖంగా ఉన్నా మని 88% మంది ఉద్యోగులు తెలిపారు. కొత్త భాషను, ముఖ్యంగా ఇంగ్లిష్‌ నేర్చుకోవడం వల్ల తమ కెరీర్‌లో పురోగతికి తోడ్పడుతుందని వారు భావిస్తున్నారు. పియర్సన్‌ స్కిల్‌ అవుట్‌లుక్‌ సర్వే లో ఈ విషయాలు తెలిశాయి. అమెరికా, బ్రిటన్, భారత్, బ్రెజిల్‌లో 4,000 మంది ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా సర్వే వివరాలు విడుదలయ్యాయి.  

► ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు నేర్చుకోవడాన్ని కొనసాగిస్తామని ప్రతి 10 మందిలో 9 మంది చెప్పారు.
► కంపెనీలు తమకు నైపుణ్య శిక్షణను ఆఫర్‌ చేస్తాయని 75 శాతం మంది చెప్పారు.  
► మన దేశంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), డేటా ప్రాసెసింగ్, కోడింగ్‌ భవిష్యత్తు ప్రాధాన్య నైపుణ్యాలుగా ఉన్నాయి.
► భవిష్యత్‌ మానవ నైపుణ్యాలుగా భాషను జెనరేషన్‌ జెడ్‌ గ్రూపులోని వారు (1990– 2010 మధ్య జన్మించిన) చూస్తున్నారు.  
► జెనరేషన్‌ ఎక్స్‌లోని వారు తమ కెరీర్‌ వృద్ధి పట్ల సానుకూల దృక్పథంతోఉన్నారు.  
► గత మూడేళ్లలో ఎదురైన అనిశ్చితుల నేపథ్యంలో తమ కెరీర్‌పై పునరాలోచన చేస్తున్నట్టు 88 శాతం జెనరేషన్‌ జెడ్‌ వారు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement