దేశంలో వీపీఎన్ సర్విస్ బ్యాన్‌ కానుందా..?

Indian Parliamentary Committee Wants To Ban VPN Services In India - Sakshi

సైబర్ బెదిరింపులు & ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి అడ్డుగా ఉన్న వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ సేవల(వీపీఎన్)ను మన దేశంలో హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిషేధించాలని చూస్తున్నట్లు సమాచారం. మీడియానామా మొదట నివేదించినట్లుగా వీపీఎన్ యాప్స్, సాధనాలు ఆన్‌లైన్‌లో సులభంగా అందుబాటులో ఉన్నాయని, దీంతో నేరస్థులు ఆన్‌లైన్‌లో అనామకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే దాని వాడకాన్ని నిషేదించాలని కోరుతున్నట్లు కమిటీ హైలైట్ చేసింది.

భారతదేశంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో దేశంలో వీపీఎన్ సేవలను శాశ్వతంగా నిషేదించాలని కమిటీ సీఫారసు చేస్తుందని నివేదిక వెల్లడించింది. వీపీఎన్‌లను గుర్తించడానికి, శాశ్వతంగా నిరోధించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని కమిటీ హోం మంత్రిత్వ శాఖను కోరింది. దేశంలో వీపీఎన్ సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్, నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖను కమిటీ కోరింది.

వీపీఎన్ అంటే ఏమిటి?
వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ అని కూడా అంటారు. సాధార‌ణంగా మనం ఇంట‌ర్నెట్ లో ఏ పనిచేసిన.. ఫేస్బుక్ చూసిన, యూట్యూబ్ చూసిన, వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించినా.. ఇత‌ర ఏవైనా ప‌నులు చేసినా హ్యాక‌ర్లు మన డేటాను త‌స్క‌రించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన డేటా సురక్షితంగా ఉండేందుకు వీపీఎన్ ప‌నికొస్తుంది. అంటే, మనకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య సురక్షితమైన కనెక్షన్ సృష్టిస్తుంది. మీ ట్రాఫిక్ ఎన్ క్రిప్ట్ చేయబడ్డ ఛానల్ ద్వారా రూట్ చేస్తుంది. ఇది మీ ఐపీ చిరునామాను దాచిపెడుతుంది.(చదవండి: జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త!)

ముఖ్యంగా, వీపీఎన్ యాప్స్ వినియోగదారులు తమ గుర్తింపును దాచేటప్పుడు తమ నెట్ వర్క్ వేరే భౌగోళిక ప్రదేశంలో ఉన్నట్లు చూపిస్తుంది. వాస్తవానికి మనం ఇక్కడ ఉన్న అమెరికా వంటి దేశాలలో ఉన్నట్లు చూపిస్తుంది. వీపీఎన్ వ‌ల్ల మ‌న ఇంట‌ర్నెట్ లో ఏం చేస్తున్న‌దీ ఇత‌రుల‌కు తెలియ‌దు. దీని వ‌ల్ల మ‌న డేటా ఎన్‌క్రిప్ట్ అయి సుర‌క్షితంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా వ‌ర‌కు సాఫ్ట్ వేర్ కంపెనీలు హ్యాకర్ల నుంచి కాపాడుకోవడం కోసం త‌మ కార్య‌క‌లాపాల‌కు గాను వీపీఎన్‌ల‌ను ఉప‌యోగిస్తుంటాయి. ఉద్యోగులు ఆఫీస్ వర్క్ కోసం ఇంటి పనిచేసినప్పుడు లాక్ డౌన్ సమయంలో ఇవి చాలా భాగ ఉపయోగపడాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top