
చెన్నై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటు పావుశాతం తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులూ ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) రెపో ఆధారిత రుణాలపై వడ్డీరేటు 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించినట్లు ప్రకటించింది.
ఈ ఏప్రిల్ 12 (శనివారం) నుంచి రెపో ఆధారిత రుణాలపై రేటును 9.10% నుంచి 8.85 శాతానికి కుదించినట్లు బ్యాంకు తెలిపింది. ప్రతీకార సుంకాల్లో భాగంగా ట్రంప్ భారత్‌పై 26% టారిఫ్ వడ్డనతో తలెత్తిన ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో వృద్ధికి దన్నుగా నిలిచేందుకు ఆర్‌బీఐ రెపో రేటును 6.25% నుంచి 6 శాతానికి తగ్గించింది.