Citroen C3: విదేశీ ఎగుమతికి సిద్దమైన బుజ్జి కారు

Indian citroen c3 exports begin full details - Sakshi

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'సిట్రోయెన్' ఇప్పుడు తమ కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి సన్నద్ధమైపోయింది. కంపెనీ దీని కోసం చెన్నైలోని కామరాజర్ పోర్ట్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం కూడా చేసింది. సిట్రోయెన్ ఎగుమతులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. 

కంపెనీ విదేశీ ఎగుమతికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ మార్గం ద్వారా రవాణా చేస్తుంది. 2023 మార్చి 31న మొదటి బ్యాచ్ మేడ్-ఇన్-ఇండియా C3 హ్యాచ్‌బ్యాక్‌లు కామరాజర్ పోర్ట్ నుండి ASEAN, ఆఫ్రికా మార్కెట్‌లకు ఎగుమతి చేయడం జరిగింది. కంపెనీ తమ కార్లను ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, కంబోడియా, సింగపూర్, మలేషియా దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది.

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ప్రపంచ వ్యాప్తంగా తమ ఉనికిని చాటుకోవడానికి తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. సి2 ఎయిర్ క్రాస్ విడుదలతో దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొంది, ఇటీవల సి3 ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసి మరింత గొప్ప అమ్మకాలను పొందటానికి సన్నద్ధమవుతోంది.

(ఇదీ చదవండి: మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్)

చెన్నైలోని కామరాజర్ పోర్ట్ నుంచి రెనాల్ట్, నిస్సాన్, టయోటా, మారుతీ సుజుకి, ఇసుజు మోటార్స్ వంటి కంపెనీలు కూడా ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరిగింది. నిజానికి ఈ పోర్ట్ ఎగుమతుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది.

సిట్రోయెన్ సి3 ధర భారతీయ మార్కెట్లో రూ. 7.02 లక్షల నుంచి రూ. 9.35 లక్షల వరకు ఉంది. అయితే ఇందులో సి3 ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ. 13.34 లక్షల నుంచి రూ. 14.06 లక్షల వరకు ఉంది. కాగా సిట్రోయెన్ కొత్త సి3 ఎయిర్‌క్రాస్ మిడ్ సైజ్ SUV ఈ నెల 27న మార్కెట్లో విడుదలకానున్నట్లు సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top