ఆర్‌బీఐ ముందుకు బ్యాడ్‌బ్యాంక్‌ లైసెన్స్‌ దరఖాస్తు!

Indian Banks association to seek license from RBI for setting up a bad bank - Sakshi

త్వరలోనే దాఖలు చేయనున్న ఐబీఏ

న్యూఢిల్లీ: నేషనల్‌ అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌)కు సంబంధించి లైసెన్స్‌ కోసం ఆర్‌బీఐకి త్వరలోనే ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) దరఖాస్తు చేసుకోనుంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో వసూలు కాని మొండి బకాయిల సమస్యకు పరిష్కారంగా ఎన్‌ఏఆర్‌సీఎల్‌ఎల్‌ (బ్యాడ్‌ బ్యాంకు) ఏర్పాటును 2021–22 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. రూ.100 కోట్ల అధీకృత మూలధనంతో కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఈ నెల 7న ఎన్‌ఏఆర్‌సీఎల్‌ను ఏర్పాటు చేసినట్టు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఫైలింగ్స్‌ చెబుతున్నాయి. ఆర్‌బీఐ నుంచి అనుమతి వచ్చినట్టయితే ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top