అదిరిపోయిన తొలి 3డీ గృహం.. 28 రోజుల్లోనే నిర్మాణం..!

Indian Army Creates First-ever 3D Printed Houses In Gandhinagar - Sakshi

ఇండియన్ ఆర్మీకి చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఎంఈఎస్) 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి రెండు ఇళ్లను నిర్మించింది. అవును! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల మాదిరిగానే 3డీ గృహాలు నిర్మించింది. 3డీ రాపిడ్ కనస్ట్రక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఇళ్లను నిర్మించినట్లు తన అధికారిక ప్రకటనలో తెలిపింది. గాంధీనగర్‌లోని నైరుతి ఎయిర్ కమాండ్ ఈ 3డీ గృహాలను దేశంలో మొట్టమొదటి సారిగా నిర్మించింది. ఈ గృహాలను నాలుగు వారాల వ్యవధిలోనే నిర్మించడం విశేషం.

ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఏఎన్ఐ మీడియా ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఈ భారత సాయుధ దళాల పెరుగుతున్న వసతి అవసరాలను వేగంగా తీర్చడానికి ఈ 3డీ గృహాలను నిర్మించాల్సి వస్తుంది అని రక్షణ దళాలు పేర్కొన్నాయి. చెన్నైకి చెందిన స్టార్టప్ త్వాస్తా సహకారంతో ఈ ఇళ్లను నిర్మించారు. ప్రతి ఇల్లు సుమారు 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గృహాలను భూకంపాలు తట్టుకునే విధంగా నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు ఎంఈఎస్ భారతదేశంలోని మొదటి 3డీ ప్రింటెడ్ శానిటరీ బ్లాక్లను జైసల్మేర్ వద్ద సుమారు 600 చదరపు అడుగుల స్థలంలో నిర్మించింది. 

(చదవండి: బంగారం రుణం తీసుకునే వ్యాపారులకు భారత్ పే శుభవార్త..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top