
కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాల ధరలు నెమ్మదించడంతో సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైంది. ఇది ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2017 జూన్‌లో 1.46 శాతంగా రికార్డు కాగా, గతేడాది సెప్టెంబర్‌లో 5.49 శాతంగా, ఈ ఏడాది ఆగస్టులో 2.07 శాతంగా నమోదైంది. ఈ ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం రెండు శాతం లోపే రికార్డు కావడం ఇది రెండోసారి.
రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో 53 బేసిస్ పాయింట్లు తగ్గిందని, 2017 జూన్ తర్వాత ఇదే కనిష్టమని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. ‘బేస్ ఎఫెక్ట్‌తో పాటు కూరగాయలు, నూనెలు, పండ్లు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, గుడ్లు, ఇంధనం మొదలైన ఉత్పత్తుల ధరలు నెమ్మదించడమనేది రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు కారణం‘ అని పేర్కొంది. గతేడాది సెపె్టంబర్‌లో 9.24%గా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఈసారి ఆగస్టులో మైనస్ 0.64%గా, సెప్టెంబర్‌లో మైనస్ 2.28%గా నమోదైంది.
ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్‌డ్రా!