ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యూజర్లకు గుడ్‌న్యూస్!

India Post Payments Bank teams up with HDFC to offer home loans - Sakshi

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) వినియోగదారులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శుభవార్త తెలిపింది. ఐపీపీబీ బ్యాంకుకు చెందిన వినియోగదారులకు గృహ రుణాలు అందించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాలను అందించడానికి ఇండియా పోస్ట్ తన దేశవ్యాప్తంగా 650 బ్రాంచ్‌లతోపాటు 1,36,000 పైగా బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఐపీపీబీ, హెచ్‌డీఎఫ్‌సీ మధ్య అవగాహన ఒప్పందం(ఎంఒయు) చేసుకున్నాయి. "ఈ భాగస్వామ్యం ఐపీపీబీ వినియోగదారులకు హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాలను సులభంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా బ్యాంకు లేని ప్రాంతాల్లోని చాలా మందికి ఫైనాన్స్ అందుబాటులో లేదు. కొత్త ఇల్లు కట్టుకోవాలనే వారి కలను నెరవేర్చడానికి ఐపీపీబీ దాదాపు 190,000 బ్యాంకింగ్ సర్వీస్ప్రొవైడర్ల(పోస్ట్ మెన్, గ్రామీణ్ డాక్ సేవక్) ద్వారా గృహ రుణాలను అందిస్తుంది" అని తెలిపింది. ఈ ఎంఒయు ప్రకారం అన్ని గృహ రుణాలకు సంబంధించిన క్రెడిట్, సాంకేతిక, చట్టపరమైన విషయాలు, ప్రాసెసింగ్, పంపిణీని హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ నిర్వహిస్తుంది.  అయితే ఐపీపీబీ కేవలం రుణాన్ని అందించడంలో బ్యాంకుకు, వినియోగదారుల మధ్య వారదులగా పని చేస్తారని వెల్లడించింది.

(చదవండి: క్రోమాతో జట్టుకట్టిన ఇన్నోవిటీ..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top