క్రోమాతో జట్టుకట్టిన ఇన్నోవిటీ..!

Croma Introduces Innoviti G E N I E Technology - Sakshi

భారత తొలి ఎలక్ట్రానిక్స్‌ ఓమ్ని-ఛానల్‌ రిటైలర్‌ క్రోమాతో ప్రముఖ ఫిన్‌ టెక్‌ సంస్థ ఇన్నోవిటీ పేమెంట్‌ సొల్యూషన్స్‌ చేతులు కలిపింది. భారత్‌లో ఎంటర్‌ప్రైజ్ వ్యాపారులకు అతిపెద్ద ప్రొవైడర్ ఆఫ్ పేమెంట్ సొల్యూషన్స్‌ గా ఇన్నోవిటీ నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా క్రోమా స్టోర్లలో ఇన్నోవిటీ తన జీరో కాస్ట్‌ ఈఎమ్‌ఐ సౌకర్యం జీని (G.E.N.I.E) టెక్నాలజీని పరిచయం చేసింది. దీంతో ఎలాంటి వడ్డీ ఛార్జీలు లేకుండా జీరో కాస్ట్‌ ఈఎమ్‌ఐలను తీసుకునే వీలు కొనుగోలుదారులకు కల్గనుంది. 
చదవండి:  రూ. 850 కోట్లను సొంతం చేసుకోనున్న నైకా టాప్‌ ఉద్యోగులు..!

దేశవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ ప్రధాన నగరాల్లోని క్రోమా అవుట్‌లెట్లలో జీనీ టెక్నాలజీని ఇన్నోవిటీ పరిచయం చేసింది. జీని సహాయంతో..క్రోమా  కస్టమర్‌లు ఇప్పుడు మూడు లేదా  6 నెలల జీరో-కాస్ట్ ఈఎమ్‌ఐను క్రోమా అవుట్‌లెట్లలోని అన్ని   క్రెడిట్ కార్డ్‌లపై రూ. 3000, డెబిట్‌ కార్డ్‌లపై రూ. 5000 కంటే ఎక్కువ విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లపై జీని టెక్నాలజీ అందిస్తోంది. క్రోమా అవుట్‌లెట్లలోని 2000 కంటే ఉత్పత్తులపై ఈ ఆఫర్‌ 2021 డిసెంబర్‌ 31 వరకు అందుబాటులో ఉండనుంది. 

ఫెస్టివల్‌ సీజన్‌ నేపథ్యంతో కొనుగోలుదారులకు వేగవంతమైన, సరసమైన క్రెడిట్ సిస్టన్‌ అందిస్తున్నామని క్రోమా ప్రతినిధి వెల్లడించారు. జీని టెక్నాలజీతో కొనుగోలుదారులు జీరో కాస్ట్‌ ఈఎమ్‌ఐలను పొందవచ్చునని పేర్కొన్నారు. జీరో-కాస్ట్ కన్స్యూమర్ ఫైనాన్సింగ్ ఆఫర్‌ (జీని) ద్వారా క్రోమా కొనుగోలుదారులకు నగదును ఆదా చేయడంలో, అదనపు ఖర్చు లేకుండా క్రెడిట్‌ను కొనుగోలుదారుల యాక్సెస్‌ చేయవచ్చునని ఇన్నోవిటీ పార్టనర్ ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హేమంత్ తావేర్ పేర్కొన్నారు.  కరోనా కారణంగా ఏర్పడిన కఠినమైన పరిస్థితుల దృష్ట్యా కొనుగోలుదారులకు  ఈఎమ్‌ఐ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతోందనీ ఇన్నోవిటీ పేర్కొంది.
చదవండి: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై టీవీఎస్‌ కీలక నిర్ణయం..! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top