 
													రెండు సంస్థల చేతుల్లోనే 80 శాతం వాటా
దీన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి
ఆర్థిక శాఖ, ఆర్‌బీఐని కోరిన ఐఎఫ్‌ఎఫ్
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీల్లో 80 శాతాన్ని కేవ లం 2 సంస్థలు (ఫోన్‌పే, జీపే) నియంత్రిస్తున్నాయంటూ.. ఈ ఏకాగ్రత రిస్క్‌ను తగ్గించేందుకు చ ర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ, ఆర్‌బీఐని ఇండి యా ఫిన్‌టెక్ ఫౌండేషన్ (ఐఎఫ్‌ఎఫ్) కోరింది. ఫిన్ టెక్ పరిశ్రమకు స్వీయ నియంత్రణ మండలిగా వ్య వహరిస్తున్న ఐఎఫ్‌ఎఫ్.. ఇందుకు సంబంధించి వి ధాపరమైన సూచనలు చేసింది. ఐఎఫ్‌ఎఫ్‌లో భాగమైన ఫిన్‌టెక్ సంస్థలతో విస్తృతమైన సంప్రదింపుల అనంతరం వీటిని రూపొందించినట్టు తెలిపింది. 
 
→ యూపీఐపై 30 థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు (టీపీఏపీలు) ఉండగా.. 80 శాతానికిపైగా లావాదేవీలు రెండు సంస్థల నియంత్రణల్లోనే ఉన్నాయి. ఈ రెండు సంస్థలు దోపిడీ ధరలతో (భారీ తగ్గింపులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు)తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటాయి. ముఖ్యంగా చిన్న సంస్థలు, దేశీ పోటీదారులను పోటీపడకుండా చేస్తాయి. 
→ ప్రభుత్వానికి చెందిన భీమ్ ప్లాట్‌ఫామ్ సైతం ఈ ద్వందాధిపత్యం దెబ్బకు మార్కెట్ వాటాను కోల్పోయింది.  
→ యూపీఐ లావాదేవీలను నగదుగా మార్చుకునే అవకాశం (ఎండీఆర్ చార్జీలు) లేకపోవడం, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు ఉన్న నిధుల వెసులుబాటు.. కొత్త సంస్థలు, చిన్న సంస్థల ప్రవేశానికి గట్టి అవరోధంగా నిలుస్తాయి. పోటీని అణచివేస్తాయి.  
→ ఒక సంస్థ గరిష్టంగా 30 శాతం లావాదేవీలకే సేవలు అందించాలన్న పరిమితిని అమలు చేయడంలో ఎన్‌పీసీఐ జాప్యం చేస్తుండడం నిర్వహణపరమైన సవాళ్లను, ఏకాగ్రత రిస్‌్కను తెలియజేస్తుంది. ఎన్‌పీసీఐ ఈ పరిమితి అమలు చేయడానికి ముందుగానే ఈ సంస్థలు మరింత పెద్దవిగా అవతరించేందుకు అనుమతించడం.. వ్యూహాత్మకమే అనిపిస్తోంది.  
→ ఈ ఏకాగ్రత రిస్‌్కను తగ్గించేందుకు బడా రెండు యూపీఐ సంస్థలు (టీపీఏపీలు) కాకుండా మిగిలిన వాటికి యూపీఐ ప్రోత్సాహకాల్లో అధిక వాటా అందుకునేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సదరు రెండు అతిపెద్ద టీపీఏపీలు ప్రోత్సాహకాల్లో అధిక భాగాన్ని పొందుతాయి. ఒక టీపీఏపీకి ప్రోత్సాహకాల్లో 10 శాతం గరిష్ట పరిమితి విధించాలి.   
 
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
