
అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి
ఫిన్‌టెక్ సంస్థలకు ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా సూచన
ముంబై: అందరూ సులభంగా ఉపయోగించగలిగే, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రోడక్టులు, సర్వీసులను డిజైన్ చేయాలని ఫిన్‌టెక్ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. సంపన్నులకు సరీ్వసులు అందించడం లాభసాటి వ్యాపారమే అయినప్పటికీ, అంతగా సేవలందని వారిపైనా చిన్న కంపెనీలు దృష్టి పెట్టాలని చెప్పారు. తద్వారా ఆరి్థక సమ్మిళితత్వం సాధించేందుకు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగేందుకు తమ వంతు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘కస్టమర్ల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ, వారు సులభంగా ఉపయోగించగలిగేలా ఉత్పత్తులు, సర్వీసులను డిజైన్ చేయాలి. అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. సీనియర్ సిటిజన్లు, డిజిటల్ అక్షరాస్యత అంతగా లేని వారు, దివ్యాంగులు కూడా ఉపయోగించగలిగేలా అసిస్టివ్ టెక్నాలజీలను పొందుపర్చాలి‘ అని మల్హోత్రా చెప్పారు. విశ్వసనీయత, నిబంధనలను పాటించడానికి భారతీయ ఫిన్‌టెక్‌లు అత్యంత ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ప్రతి ప్రోడక్టు, సరీ్వసులోను వినియోగదారుల డేటా గోప్యతను పరిరక్షిస్తూ, పారదర్శకతకు పెద్ద పీట వేయాలని పేర్కొన్నారు.
గ్లోబల్ రేంజ్‌లో...
లోకల్‌గా ఉంటూనే గ్లోబల్ స్థాయిలో ఆలోచించాలని, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయాలని, ఉత్తమ విధానాలను అమలు చేయాలని మల్హోత్రా సూచించారు. ఫిన్‌టెక్ సంస్థలు డిజిటల్ తారతమ్యాలను చెరిపివేయగలవని, నవకల్పనలకు ఊతమివ్వగలవని ఆయన పేర్కొన్నారు. ఆరి్థక సేవలను తక్కువ ఖర్చులతో భారీ స్థాయిలో అందించడాన్ని ఫిన్‌టెక్ సాధ్యం చేసిందని తెలిపారు. ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న డిజిటల్ మోసాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని మల్హోత్రా తెలిపారు. ఈ దిశగా ఆర్‌బీఐ విభాగం రూపొందించిన మ్యూల్‌హంటర్ సొల్యూషన్‌ని ప్రస్తుతం 21 బ్యాంకులు ఉపయోగిస్తున్నాయని చెప్పారు. మోసగాళ్లు ఉపయోగించే ఖాతాలను ట్రాక్ చేయడంలో 90 శాతం సక్సెస్ రేటు ఉంటోందని తెలిపారు. కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియలను, యూజర్ ఇంటర్‌ఫేస్‌లను మెరుగుపర్చేందుకు, డేటా భద్రతను పటిష్టం చేసేందుకు నిర్దిష్ట ప్రమాణాలను ప్రవేశపెట్టడంపై ఆర్‌బీఐ కసరత్తు చేస్తోందని మల్హోత్రా వివరించారు.
పదేళ్లలో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..
గత దశాబ్దకాలంగా సుమారు 10,000 ఫిన్‌టెక్ సంస్థలు 40 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులను దక్కించుకున్నాయని మల్హోత్రా వివరించారు. రాబోయే రోజుల్లోనూ ఈ రంగం గణనీయంగా వృద్ధి చెందనుందని చెప్పారు. సుశిక్షితులైన టెక్నాలజీ నిపుణుల లభ్యత, చెల్లింపులు.. బీమా .. మొదలైన విభాగాలవ్యాప్తంగా ఆ ర్థిక వ్యవస్థ క్రియాశీలకంగా ఉండటం ఫిన్‌టెక్‌లో కొత్త ఆవిష్కరణలకు దోహదపడుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు కూడా పరిశ్రమకు చేయూతనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నాయని మల్హోత్రా తెలిపారు. మరోవైపు, తాను కొన్నాళ్లుగా ప్రస్తావిస్తున్న ’ఫిన్‌టర్నెట్’ వ్యవస్థ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. స్థలాలు, ప్రాపరీ్టలు, బాండ్లు, ఆర్థిక పెట్టుబడులు మొదలైన అసెట్స్ అన్నీ ఒకే ప్లాట్‌ఫాంపైకి తెచ్చేందుకు, లావాదేవీలను సులభతరం చేసేందుకు ఉపయోగపడేలా ఇది ఉంటుంది.