మార్చిలో తయారీ రంగం పరుగు | Sakshi
Sakshi News home page

మార్చిలో తయారీ రంగం పరుగు

Published Tue, Apr 4 2023 4:21 AM

India manufacturing sector hits 3-month high in March - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ తయారీ రంగం మార్చిలో మంచి పురోగతి కనబరచింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) మూడు నెలల గరిష్ట స్థాయిలో 56.4కు వద్దకు చేరింది. డిమాండ్‌ ఊపందుకోవడంతో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినట్లూ వివరించింది. ఫిబ్రవరిలో పీఎంఐ 55.3గా నమోదయ్యింది.

అయితే సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సూచీ వృద్ధి బాటన కొనసాగడం వరుసగా 21వ నెల. ఉద్యోగ కల్పన విషయానికి వస్తే, మార్చిలో పేరోల్‌ సంఖ్యలో దాదాపు మార్పులేదు. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కిట్‌ ఇంటెలిజెన్స్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు.

Advertisement
Advertisement