FDI: ఆ మూడు రంగాలే కీలకం, భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు!

India Foreign Direct Investment Inflow Rises - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దులను పంచుకుంటున్న దేశాల నుంచి ప్రధానంగా మూడు శాఖలకు అధిక స్థాయిలో పెట్టుబడి ప్రతిపాదనలు వస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఎలక్ట్రానిక్స్‌– ఐటీ, పరిశ్రమలు– అంతర్గత వాణిజ్యం, భారీ పరిశ్రమల్లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలు లభిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు.  

2020 ఏప్రిల్‌లో ప్రభుత్వం పొరుగు దేశాల నుంచి పెట్టుబడుల విషయంలో ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. కోవిడ్‌–19 మహమ్మారి నేపథ్యంలో దేశీ కంపెనీల టేకోవర్‌ అవకాశాలను అడ్డుకునే యోచనతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. జాబితాలో చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆప్ఘనిస్తాన్‌ ఉన్నాయి. 

ఈ దేశాలకు చెందిన వ్యక్తులు లేదా కంపెనీలు దేశీయంగా ఏ రంగంలోనైనా పెట్టుబడులు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా మారింది. పొరుగు దేశాల నుంచి లభిస్తున్న ఎఫ్‌డీఐ ప్రతిపాదనల్లో ప్రధానంగా భారీ యంత్రాలు, ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ట్రేడింగ్, వాణిజ్యం, ఈకామర్స్, తేలికపాటి ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ తయారీ రంగాలున్నట్లు ప్రభుత్వ అధికారి వివరించారు. 

చదవండి: భారత్‌పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top