ICICI Bank Q4 Results: Net profit jumps 30% YoY at Rs 9,122 crore - Sakshi
Sakshi News home page

లాభాల బాటలో ఐసీఐసీఐ బ్యాంక్‌.. ఫలితాలు ఇలా!

Published Mon, Apr 24 2023 7:06 AM

Increased ICICI bank profits - Sakshi

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధింంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి-మార్చి(క్యూ4)లో నికర లాభం 27 శాతం ఎగసి రూ. 9,853 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 30 శాతం జంప్‌చేసి రూ. 9,122 కోట్లకు చేరింది. ఇందుకు రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు సహకరించాయి. సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 40 శాతం దూసుకెళ్లి రూ. 17,667 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4 శాతం నుంచి 4.9 శాతానికి బలపడ్డాయి. రుణాల్లో 19 శాతం వృద్ధి ఇందుకు దోహదపడింది.

ఆదాయం సైతం అప్‌ 
గతేడాది క్యూ4లో ఐసీఐసీఐ బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ. 27,412 కోట్ల నుంచి రూ. 36,109 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 17,119 కోట్ల నుంచి రూ. 22,283 కోట్లకు పెరిగాయి. స్థల మొండిబకాయిలు 3.6 శాతం నుంచి 2.81 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 1,068 కోట్ల నుంచి రూ. 1,619 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 18.34 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నికర లాభం రూ. 185 కోట్ల నుంచి రూ. 235 కోట్లకు, సాధారణ బీమా లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు జంప్‌చేశాయి. 

Advertisement
Advertisement