
సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు ఉండాలని, ఐసీఐసీఐ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాంకుల మినిమమ్ బ్యాలెన్స్ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 'సంజయ్ మల్హోత్రా' (Sanjay Malhotra) స్పందించారు.
ఒక ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలనేది పూర్తిగా ఆ బ్యాంకుల పరిధిలోకే వస్తుంది. కొన్ని బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ను రూ. 50వేలు, మరికొన్ని రూ. 10వేలు, ఇంకొన్ని రూ. 2వేలుగా నిర్ణయించుకున్నాయి. కొన్ని బ్యాంకులైతే మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో ఎలాంటి నియమాలను సూచించదు. ఇదంతా సదరు బ్యాంక్ తీసుకునే నిర్ణయమే అని, ఈ అంశం ఆర్‌బీఐ పరిధిలోకి రాదని సంజయ్ మల్హోత్రా గుజరాత్‌లో జరిగిన ఆర్థిక చేరిక సమావేశంలో స్పష్టం చేశారు.
ఐసీఐసీఐ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్
మెట్రో, పట్టణ శాఖలలోని వినియోగదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50,000 ఉండేలా చూడాలి.
సెమీ అర్బన్ ప్రాంతాలలో వినియోగదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 25,000 ఉండేలా చూడాలి
గ్రామీణ ఖాతాదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 10,000 ఉంచాలి.
ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?