దాయాది దేశాల మ్యాచా? మజాకా? 10 సెకన్ల యాడ్‌కు రూ.30 లక్షలు!

ICC T20 World Cup: Crazy Advertising Rates for India Pakistan Match - Sakshi

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఇంకా ప్రారంభమే కాలేదు అప్పుడే రికార్డుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం.! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది.! ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్‌ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాది దేశాలు అక్టోబ‌ర్ 24న దుబాయ్ వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ఉండే క్రేజే అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు కాసుల వర్షం కురిపించనుంది.(చదవండి: ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. యూట్యూబ్‌ మ్యూజిక్‌ సరికొత్త ఆఫర్‌!)

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే ఈ దాయాదీ దేశాల మ్యాచ్ సమయంలో యాడ్స్ కోసం 14 మంది స్పాన్సర్లతో ఒప్పంద సంతకాలు చేసింది. అందరూ ఊహించినట్టే భారత్-పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో 10 సెకన్ల యాడ్ కోసం మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు అయ్యాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ బ్రాడ్‌ కాస్టింగ్‌ హక్కులను దక్కించుకున్న స్టార్‌స్పోర్ట్స్‌కు యాడ్స్‌ రూపంలో కనక వర్షం కురుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లైవ్ బ్రాడ్ కాస్ట్ భాగస్వామి అయిన స్టార్ స్పోర్ట్స్ 10 సెకన్ల యాడ్ కోసం 25-30 లక్షల రూపాయలు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఈ యాడ్స్‌ విషయంపై స్టార్‌​ స్పోర్ట్స్‌ ప్రతినిధిని స్పష్టత ఇవ్వలేదు.(చదవండి: Windows 11: వచ్చిందోచ్‌.. మీ కంప్యూటర్‌ సపోర్ట్‌ చేస్తుందా?)

ఇందులో డ్రీమ్ 11, బైజుస్, ఫోనెప్, థంప్స్, విమల్, హావెల్స్, జియోమార్ట్, netmeds.com సహ-ప్రజంటింగ్ స్పాన్సర్లు, ఆకాశ్, స్కోడా, వైట్ హాట్జ్ర్, గ్రేట్ లెర్నింగ్, కాయిన్ డిఎక్స్, మరియు ట్రెండ్స్ అసోసియేట్ స్పాన్సర్లు ఉన్నారు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ యాడ్స్ రేట్లు 10 సెకండ్ల కోసం 25-30 లక్షల చెల్లించినట్లు తెలుస్తుంది. అలాగే, సహ-ప్రజంటింగ్ స్పాన్సర్ షిప్ 60-70 కోట్లకు విక్రయించబడింది. బ్రాడ్ కాస్టర్ అసోసియేట్ స్పాన్సర్ షిప్ 30-35 కోట్ల కొరకు ఆఫర్ చేసినట్లు సమాచారం. 2016లో మన దేశంలో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ టీ20 సందర్భంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, దూరదర్శన్లలో 17.3 రేటింగ్ తో 83 మిలియన్ల మందికి చేరుకుంది. ఇప్పటికే వరకు ఇదే అత్యుత్తమ రేటింగ్ గల టీ-20 మ్యాచ్.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top