మేడ్చల్‌ క్లస్టర్‌ హవా.. ఆ స్థలాలకు ఫుల్‌ డిమాండ్‌ | Hyderabad Real estate demand for warehouse space | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌ క్లస్టర్‌ హవా.. ఆ స్థలాలకు ఫుల్‌ డిమాండ్‌

Jun 28 2025 8:14 PM | Updated on Jun 29 2025 9:51 AM

Hyderabad Real estate demand for warehouse space

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్‌ పెరుగుతోంది. గతేడాది నగరంలో 51 లక్షల చ.అ. వేర్‌హౌస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్‌మైల్‌ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో గిడ్డంగుల విభాగానికి దీర్ఘకాలిక డిమాండ్‌ ఉంటుందని తెలిపింది. వేర్‌హౌస్‌ లావాదేవీలలో తయారీ రంగం హవా కొనసాగుతోంది. 2024లో జరిగిన గిడ్డంగుల లీజులలో మ్యానుఫాక్చరింగ్‌ విభాగం వాటా 39 శాతం కాగా.. 3 పీఎల్‌ 21 శాతం, ఈ–కామర్స్‌ 17 శాతం, రిటైల్‌ రంగం 14 శాతం, ఎఫ్‌ఎంసీజీ 5 శాతం, ఎఫ్‌ఎంసీడీ 1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

మేడ్చల్‌ క్లస్టర్‌ హవా.. 
నగరంలో మూడు క్లస్టర్లలో గిడ్డంగుల స్థలాలున్నాయి. మేడ్చల్‌ క్లస్టర్‌లో మేడ్చల్, దేవరయాంజాల్‌–గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, యెల్లంపేట్, శామీర్‌పేట్, పటాన్‌చెరు ఇండ్రస్టియల్‌ ఏరియా, రుద్రారం, పాశమైలారం, ఎదులనాగులపల్లి, సుల్తాన్‌పూర్, ఏరోట్రోపోలిస్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్‌నగర్‌.. ఆయా ప్రాంతాలలో గ్రేడ్‌–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19–21గా, గ్రేడ్‌–బీ అయితే రూ.16–19గా ఉంది. 

👉 ఇదీ చదవండి: హైదరాబాద్‌లో భూముల ధరలు.. ఆకాశం వైపు..

మేడ్చల్‌ క్లస్టర్‌లో వేర్‌హౌస్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలోని గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్‌ వాటా 60 శాతం ఉండగా.. 2024 నాటికి 61 శాతానికి పెరిగింది. శంషాబాద్‌ క్లస్టర్‌లో క్షీణత, పటాన్‌చెరు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఏడాది సమయంలో శంషాబాద్‌ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గగా.. పటాన్‌చెరు క్లస్టర్‌ వాటా 10 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది.  

డిమాండ్‌ ఎందుకంటే.. 
హైదరాబాద్‌ అనేక రంగాలు ప్రొడక్షన్‌ లింక్డ్‌ న్సెంటివ్‌(పీఎల్‌ఐ) స్కీమ్‌ కింద అనుమతులు పొందాయి. ప్రధానంగా సెల్‌ఫోన్ల తయారీ, ఆటో అనుబంధ రంగానికి చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్‌ ఏర్పడిందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement