పారిస్‌ ఎయిర్‌పోర్టుని మరిపించేలా శంషాబాద్‌లో..

Huge Funds Will Be Investing to Expand Hyderabad Airport - Sakshi

తెలంగాణలో ఉన్న జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుని సర్వహంగులతో ఆధునీకరించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించనున్నారు. 

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవల ఫ్రాన్స్‌కి చెందిన పారిశ్రామికవేత్తలు, రాయబారులతో కూడిన బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌లో ఉన్న అనుకూలతలు, తెలంగాణ ప్రభుత్వం అవంలభిస్తున్న విధానాలను మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే మరో అంశం తెరపైకి వచ్చింది.

ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తల పర్యటన సందర్భంగా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌, హైదరాబాద్‌ డిప్యూటీ సీఈవో ఆంటోనియో కొంబ్రెజ్‌ మాట్లాడుతూ.. శంషాబాద్‌లో ఉన్న ఎయిర్‌పోర్టుని రూ. 6,300 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇక్కడి నుంచి ప్రతీ ఏడు 34 లక్షల మంది ప్రయాణికుల రద్దీ తగ్గట​‍్టుగా ఇక్కడ సౌకర్యాలు ఆధునీకరించబోతున్నట్టు వెల్లడించారు. ఇదే జరిగితే ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ఉన్న ఓర్లీ ఎయిర్‌పోర్టుకి ధీటుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మారుతుంది.

ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలు ఇండియాలో పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉంటే మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహం అందిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. దీంతో అనేక కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నాయి. ఇప్పటికే జార్జ్‌ మోనిన్‌ సంస్థ హైదరాబాద్‌లో ఉన్న తమ ప్లాంటును రూ. 200 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. ఇదే తరహాలో అనేక కంపెనీలు ఉన్నాయి. వారిని ఆకట్టుకునేలా రాకపోకలకు సంబంధించి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయనున్నట్టు వెల్లం‍్లడించారు. 
 

చదవండి : ఎయిర్‌ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే !

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top