ఫోటోలు కడిగించాలంటే స్టూడియోకి వెళ్లే పనిలేదు..చేతిలో ఈ గాడ్జెట్‌ ఉంటే చాలు

Hp Sprocket Studio Plus Wi-fi Portable Printer Review - Sakshi

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక ఫొటోగ్రఫీ తేలికైంది. అయితే, స్మార్ట్‌ఫోన్‌లో ముచ్చటగా తీసుకున్న ఫొటోలను ముద్రించుకోవాలంటే మాత్రం స్టూడియోలు, కలర్‌ ల్యాబ్‌లకు వెళ్లాల్సిందే! అంత శ్రమ లేకుండా సత్వరమే ఫొటోలు ముద్రించగల ఫొటో ప్రింటర్‌ను కంప్యూటర్ల తయారీ సంస్థ హ్యూలెట్‌ పాకార్డ్‌ ‘హెచ్‌పీ’ అందుబాటులోకి తెచ్చింది.

ఇది స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ‘హెచ్‌పీ స్ప్రాకెట్‌ స్టూడియో ప్లస్‌’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఫొటో ప్రింటర్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు, ఐఫోన్‌ల ద్వారా తేలికగా ఉపయోగించవచ్చు.

వాటిలో డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ ద్వారా క్షణాల్లోనే కోరుకున్న ఫొటోలను ముద్రించుకోవచ్చు. ఇందులో 6 “ 4 అంగుళాల సైజులో మాత్రమే ఫొటోలను ముద్రించుకునే అవకాశం ఉంది. దీని ధర 149.99 డాలర్లు (రూ.12,374) మాత్రమే!  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top