వాట్సాప్ న్యూ ఇయర్ స్టిక్కర్స్! 

How to Send New Year 2021 Stickers on WhatsApp - Sakshi

స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపడం కోసం కొత్త ఏడాది 2021కి సంబందించిన వాట్సాప్ స్టిక్కర్లు కోసం చూస్తున్నారా? చింతించకండి, ఇప్పుడు మీరు వాట్సాప్ ద్వారా కొత్త ఏడాదికి సంబందించిన స్టిక్కర్స్ సులభంగా పంపించుకోవచ్చు. దీని కోసం, మీరు ప్లే స్టోర్ నుండి థర్డ్ పార్టీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ లో కేవలం కొన్ని ప్రాథమిక స్టిక్కర్ ప్యాక్‌లను మాత్రమే లభిస్తాయి అని మీకు తెలుసు. పండుగ ఆధారిత స్టిక్కర్‌ల కోసం మీరు ఎల్లప్పుడూ థర్డ్ పార్టీ యాప్ లపై ఆధారపడాలి. ఇప్పుడు కొత్త ఏడాదికి సంబందించిన కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ మేము మీకోసం అందిస్తున్నాం. వీటిని డౌన్‌లోడ్ చేసుకున్నాక ఏ విదంగా ఉపయోగించాలో క్రింద చదవండి.(చదవండి: ఐఫోన్ ఫ్లిప్ ఫోన్ వచ్చేస్తుంది!)

స్టెప్ 1: గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి న్యూ ఇయర్ 2021 స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ అని టైప్ చేయండి.
స్టెప్ 2: ఇప్పుడు మీకు నచ్చిన లేదా మేము సూచించిన “హ్యాపీ న్యూ ఇయర్ 2021 స్టిక్కర్స్”ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ యాప్ ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి మీకు మొత్తం ఆరు న్యూ ఇయర్ 2021 స్టిక్కర్ ప్యాక్‌లు కనిపిస్తాయి.
స్టెప్ 3: మీరు ప్రతి స్టిక్కర్ ప్యాక్‌ని తెరిచిన తర్వాత అందులో మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్‌ని "+" బటన్‌పై క్లిక్ చేసి వాటిని వాట్సాప్‌కు స్టిక్కర్‌లకు జోడించవచ్చు. 
స్టెప్ 4: ఇప్పుడు మీరు పంపాలి అనుకున్న వ్యక్తి యొక్క చాట్ విండోను తెరిచి టైపింగ్ బార్‌లో ఉన్న స్మైలీ చిహ్నాన్ని ప్రెస్ చేసి ఆపై స్టిక్కర్స్ విభాగానికి వెళ్లండి. ఇక్కడ, మీరు కొత్తగా జోడించిన న్యూ ఇయర్ 2021 స్టిక్కర్లను చూస్తారు. ఇప్పుడు మీకు నచ్చిన వాటిని మీ మిత్రులకు, బందువులకు పంపించవచ్చు. 

 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top