సుందర్‌ పిచాయ్‌ నోట.. నాన్‌ స్లీప్‌ డీప్‌ రెస్ట్‌..

How Google CEO Sundar Pichai Overcome Mental Pressure - Sakshi

సవాలక్ష ఒత్తిళ్లతో నిండిపోయి ఉంటుంది కార్పొరేట్‌ వరల్డ్‌. ఇక గూగుల్‌ లాంటి బడా కంపెనీలను నడిపించే సుందర్‌ పిచాయ్‌లాంటి వాళ్లపై అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అంత ఒత్తిడిని ఎలా డీల్‌ చేస్తాను, పని చేసేందుకు కావాల్సిన శక్తిని తిరిగి ఎలా తెచ్చుకుంటాననే విషయాలను వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల వెల్లడించారు సుందర్‌ పిచాయ్‌. 

పని ఒత్తిడి మధ్య రిలాక్స్‌ అయ్యేందుకు చాలా మంది సీఈవోలో టూర్లకు వెళ్తుంటారు. ప్రకృతిలో విహార యాత్రలు చేస్తుంటారు. కానీ సుందర్‌ పిచాయ్‌ బయట ఎక్కడా అడుగు పెట్టరట. తాను ఉన్న చోటులోనే ప్రత్యేకమైన పద్దతిలో విశ్రాంతి తీసుకుంటారట. దీన్ని నాన్‌ స్లీపింగ్‌ డీప్‌ రెస్ట్‌ (ఎన్‌ఎస్‌డీఆర్‌)గా పేర్కొంటారట.

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైన్స్‌ ప్రొఫెసర్‌ ఆండ్ర్యూ హ్యుబర్‌ ఈ ఎన్‌ఎస్‌డీఆర్‌ టెక్నిక్‌ని అమెరికాలో విస్త్రృతం చేశారు. ఒక చోట కదలకుండా ఉండి ఆలోచనలను ఒకే అంశంపై నియంత్రిస్తూ ఉండటం వల్ల ఒత్తిడిని త్వరగా జయించవచ్చంటూ ఎన్‌ఎస్‌డీఆర్‌ టెక్నిక్‌ని అమెరికన్లలో పాపులర్‌ చేశారు. 

ఎన్‌ఎస్‌డీఆర్‌కి సంబంధించిన విధానాలను యూట్యూబ్‌ ద్వారా చూస్తూ సుందర్‌ పిచాయ్‌ సుందర్‌ పిచాయ్‌ ఒత్తిడిని దూరం చేసుకుంటారట. నేలపై ఒక చోట పడుకుని ఆలోచనలను నియంత్రిస్తూ.. క్రమంగా ఆలోచనా రహిత స్థితికి చేరుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు బ్రెయిన్‌ మరింత షార్ప్‌గా పని చేస్తుందంటున్నారు సుందర్‌ పిచాయ్‌.

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ప్రతిపాదిన నాన్‌ స్లీపింగ్‌ డీప్‌ రెస్ట్‌ మెథడ్‌ని మన భారతీయులు ఎప్పుడో కనిపెట్టారు. శ్వాసమీద ధ్యాస, యోగ నిద్ర పేరుతో ప్రాచీన మహర్షులు మెదడుపై ఒత్తిడిని తగ్గించి ఉత్తేజపరిచే మార్గాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 

చదవండి: Sundar Pichai: ఆఖరిసారి అప్పుడే ఏడ్చాను

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top