పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు | Home loans been increasing in two financial years to Rs10 lakh Crs | Sakshi
Sakshi News home page

పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు

May 6 2024 12:05 PM | Updated on May 6 2024 1:01 PM

Home loans been increasing in two financial years to Rs10 lakh Crs

సొంతిల్లు సామాన్యుడి కల. రో​జురోజుకు రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ పెరుగుతోంది. దాంతో రియల్టీ వ్యాపారులు, గృహాలు నిర్మిస్తున్న డెవలపర్లు వాటిని కొనుగోలు చేయాలనుకునేవారిని వివిధ మార్గాల ద్వారా ఆకర్షిస్తున్నారు. దాంతో మరింత సమయం వేచిచూస్తే ధరలు పెరుగుతాయనే భావనతో ఎలాగోలా అప్పు చేసైనా గృహాలు కొంటున్నారు. అలా ఏటా వినియోగదారులు తీసుకుంటున్న గృహ రుణాలు బ్యాంకుల వద్ద పేరుకుపోతున్నాయి. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రికార్డు స్థాయిలో రూ.10లక్షల కోట్ల గృహ నిర్మాణ రంగ రుణాలు పెరిగాయి.

ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

2024 మార్చి నెల వరకు గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం తెలిసింది. 2022 మార్చి నాటికి రూ.17,26,697 కోట్ల బకాయిలు ఉండగా, 2023 మార్చి నాటికి రూ.19,88,532 కోట్లకు, 2024 మార్చి నాటికి రూ.27,22,720 కోట్లకు చేరాయని పేర్కొంది. వాణిజ్య స్థిరాస్తి రుణ బకాయిలు 2024 మార్చి నాటికి రూ.4,48,145 కోట్లకు చేరాయని, 2022 మార్చిలో రూ.2,97,231 కోట్లుగా ఉన్నాయని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement