ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల రంగంలోకి హిందుస్తాన్‌ మోటార్స్‌ | Hindustan Motors Enters Electric Vehicle Segment Launch 2 Wheelers | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల రంగంలోకి హిందుస్తాన్‌ మోటార్స్‌

Oct 29 2022 2:28 PM | Updated on Oct 29 2022 2:36 PM

Hindustan Motors Enters Electric Vehicle Segment Launch 2 Wheelers - Sakshi

సి.కె.బిర్లా గ్రూప్‌ కంపెనీ అయిన హిందుస్తాన్‌ మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2023–24లో ఈవీలు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఇందుకోసం యూరప్‌నకు చెందిన ఓ సంస్థతో కలిసి సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో  ఉత్తరపర ప్లాంటును ఆధునీకరించి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఇరు సంస్థలు కలిసి తొలుత రూ.600 కోట్లు వెచ్చిస్తాయి.

జేవీ ఏర్పాటైన తర్వాత పైలట్‌ రన్‌కు ఆరు నెలల సమయం పట్టనుందని హిందుస్తాన్‌ మోటార్స్‌ చెబుతోంది. ఎలక్ట్రిక్‌ ఫోర్‌ వీలర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టే అవకాశం ఉంది. అంబాసిడర్‌ కార్లకు డిమాండ్‌ లేకపోవడంతో ఉత్తరపర ప్లాంటు 2014లో మూతపడింది. 314 ఎకరాల స్థలం ఇతర అవసరాలకు విక్రయించుకునేందుకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కంపెనీకి ఇప్పటికే  అనుమతించింది.

చదవండి: బంగారమా? ఇల్లా? పెట్టుబడికి ఏది బెటర్‌? ఈ విషయాలు తెలుసుకోండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement