క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌.. వార్షిక వేతనాల్లో కోత | Sakshi
Sakshi News home page

HCU: క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌పైనా కరోనా ఎఫెక్ట్‌

Published Fri, Sep 3 2021 2:20 PM

Highest Package Dropped In Hyderabad Central University - Sakshi

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు అడ్డా అయిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీపై కోవిడ్‌ ఎఫెక్ట్‌ పడింది. ఒకప్పుడు రికార్డు స్థాయిలో వార్షిక వేతనాలు దక్కించుకున్న విద్యార్థులకు నేడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. 
 

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌
దేశంలో నైపుణ్యం, ప్రతిభ కలిగిన విద్యార్థులందరూ వచ్చి చేరే క్యాంపస్‌లలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఒకటి. ప్రపంచ స్థాయి కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఇక్కడికి వస్తుంటాయి. విద్యార్థులు ఫైనల్‌ ఇయర్‌లో ఉండగానే లక్షల జీతాలు చెల్లించి తమ సంస్థలో చేర్చుకుంటామంటూ ఆఫర్‌ లెటర్లు ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. 

ఈ ఏడాది ఇదే అధికం
ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి  ఎంటెక్‌​ విద్యార్థి సోమ్‌నాథ్‌పాల్‌ అత్యధిక వార్షిక వేతనం దక్కించుకున్న విద్యార్థిగా నిలిచారు, ఒక మల్టీ నేషనల్‌ కంపెనీ రూ. 17 లక్షల వార్షిక వేతనం చెల్లించే ఒప్పందం మీద సోమ్‌నాథ్‌కి అవకాశం పొందారు. అంతకు ముందు ఏడాది అత్యధిక వార్షిక వేతనం రూ. 43 లక్షలు ఉండగా కోవిడ్‌కి ముందు ఏడాది ఈ మొత్తం రూ. 45 లక్షలుగా నమోదు అయ్యింది.

రూ. 20 లక్షల తేడా
కోవిడ్‌ కారణంగా కంపెనీలు ఎక్కువ వేతనం చెల్లించేందుకు సిద్ధంగా లేవు. దీంతో ఏడాది వ్యవధిలోనే ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వంటి చోట అత్యధిక వార్షిక వేతనాల్లో ఏకంగా 20 లక్షల వరకు తగ్గిపోయింది. ఇక  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ సగటు వేతనం రూ. 8 నుంచి 10 లక్షల మధ్య ఉంటుండగా ఇప్పుడు అది రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పడిపోయిందని వర్సిటీ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రేరణ తెలిపారు. 

ఈ కోర్సులకే ప్రాముఖ్యత
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కోసం వస్తున్న కంపెనీలు ఎక్కువగా డేటా ఎనలటిక్స్‌, బిజినెస్‌ ఎనలటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ తదితర రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పొందారు. 

చదవండి : రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్‌ సరికొత్త ఆవిష్కరణ!

Advertisement
Advertisement