ఫార్మా- రికార్డులే.. రికార్డులు

Healthcare sector hits new record- Pharma shares in new highs - Sakshi

బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ సరికొత్త గరిష్టానికి

లారస్‌ ల్యాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ చరిత్రాత్మక గరిష్టాలకు

నాట్కో, ఆర్‌పీజీ, హెస్టర్‌ బయో, సువెన్‌ లైఫ్‌, లుపిన్‌ జోరు

52 వారాల గరిష్టాలకు స్ట్రైడ్స్‌ ఫార్మా, హికాల్‌, న్యూలాండ్‌, లుపిన్‌

ప్రధానంగా హెల్త్‌కేర్ రంగానికి పెరిగిన డిమాండ్‌తో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు ఫార్మా కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో బీఎస్‌ఈలో ఫార్మా ఇండెక్స్‌ సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో లారస్‌ ల్యాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సైతం చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. అంతేకాకుండా పలు ఇతర ఫార్మా రంగ షేర్లు 52 వారాల గరిష్టాలను చేరడం విశేషం! వివరాలు ఇలా..

జోరుగా హుషారుగా
బీఎస్‌ఈలో హెల్త్‌కేర్‌ రంగ ఇండెక్స్‌ దాదాపు 4 శాతం జంప్‌చేసింది. 20,529ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా..  ఫార్మాస్యూటికల్‌ కౌంటర్లలో లారస్‌ ల్యాబ్స్‌ తొలుత 6.5 శాతం జంప్‌చేసి రూ. 1497 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 5.7 శాతం ఎగసి రూ. 1484 వద్ద ట్రేడవుతోంది. ఈ వారంలో లారస్‌ షేరు 18 శాతం బలపడగా.. కోవిడ్‌-19 కట్టడికి వీలుగా రష్యన్‌ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు సిద్ధపడుతున్న డాక్టర్‌ రెడ్డీస్‌ తొలుత దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 5303కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 8.2 శాతం జంప్‌చేసి రూ. 5222 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లోనే ఈ షేరు 15 శాతం ర్యాలీ చేయడం విశేషం! 

యమ స్పీడ్‌
హెల్త్‌కేర్‌ రంగ కౌంటర్లలో ప్రస్తుతం నాట్కో ఫార్మా 19 శాతం దూసుకెళ్లి రూ. 921 వద్ద, ఆర్‌పీజీ లైఫ్‌ 8 శాతం జంప్‌చేసి రూ. 406 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో హెస్టర్‌ బయో 8 శాతం ఎగసి రూ. 1790ను తాకగా.. సువెన్‌ లైఫ్‌ 6 శాతం లాభంతో రూ. 55కు చేరింది. ఇతర కౌంటర్లలో లుపిన్‌ 6 శాతం బలపడి రూ. 1100 వద్ద, సిప్లా 6 శాతం పెరిగి రూ. 795 వద్ద, గ్రాన్యూల్స్‌ 5.5 శాతం జంప్‌చేసి రూ. 384 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా న్యూలాడ్‌ ల్యాబ్స్‌ 5 శాతం పెరిగి రూ. 1181ను తాకగా.. జేబీ కెమికల్స్‌ 4.3 శాతం ఎగసి రూ. 1115కు చేరింది. కాగా. దివీస్‌ ల్యాబ్స్‌ 4.3 శాతం లాభంతో రూ. 3350 వద్ద, క్యాప్లిన్‌ పాయింట్‌ 4 శాతం వృద్ధితో రూ. 595 వద్ద, కేడిలా హెల్త్‌కేర్‌ 4 శాతం పుంజుకుని రూ. 409 వద్ద, వొకార్డ్‌ 3.6 శాతం పెరిగి రూ. 307 వద్ద, గ్లెన్‌మార్క్‌ 3.5 శాతం వృద్ధితో రూ. 510 వద్ద కదులుతున్నాయి. 

ఏడాది గరిష్టాలకు..
బీఎస్‌ఈలో స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ 2.3 శాతం పెరిగి రూ. 745 వద్ద, లింకన్‌ ఫార్మా 2.5 శాతం పుంజుకుని రూ. 270 వద్ద, హికాల్‌ 3 శాతం ఎగసి రూ. 190 వద్ద, లుపిన్‌ రూ. 1111  వద్ద, న్యూలాండ్‌ ల్యాబ్స్‌ రూ. 1199 వద్ద 52 వారాల గరిష్టాలను అందుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top