అంచనాలు మించిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ పనితీరు! | Hdfc Life Insurance Net Profit Rises 21% To Rs 365 Crore | Sakshi
Sakshi News home page

అంచనాలు మించిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ పనితీరు!

Published Wed, Jul 20 2022 7:12 AM | Last Updated on Wed, Jul 20 2022 12:29 PM

Hdfc Life Insurance Net Profit Rises 21% To Rs 365 Crore - Sakshi

ముంబై: జీవిత బీమా రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ పనితీరు జూన్‌ త్రైమాసికంలో అంచనాలకు అందుకుంది. నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.365 కోట్లకు చేరుకుంది. పాలసీల రెన్యువల్‌ నిష్పత్తి గరిష్ట స్థాయిలో ఉండడం మార్జిన్లు పెరిగేందుకు దారితీసింది.

మొత్తం ప్రీమియం ఆదాయం 23 శాతం పెరిగి రూ.9,396 కోట్లుగా నమోదైంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.7,656 కోట్లుగా ఉంది. దీన్ని మరింత వివరంగా చూస్తే.. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి) 27 శాతం పెరిగి రూ.4,776 కోట్లకు చేరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement