
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంకుల రుణ వితరణ (Bank loans) గణనీయంగా పెరిగింది. రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank ) రుణాలు 9 శాతం పెరిగి రూ. 27.9 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు క్రెడిట్ బుక్ రూ. 25.6 లక్షల కోట్లుగా నమోదైంది.
మరోవైపు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో రుణ వృద్ధి 15.8 శాతంగా నమోదైంది. రుణాల పరిమాణం రూ. 3.99 లక్షల నుంచి రూ. 4.62 లక్షల కోట్లకు ఎగిసింది. ఇక ఐడీబీఐ బ్యాంకు రుణాలు 15 శాతం పెరిగి రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.3 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం వ్యాపారం 12 శాతం పెరిగింది.
రూ. 4.78 లక్షల కోట్ల నుంచి రూ. 5.33 లక్షల కోట్లకు ఎగిసింది. అటు క్యూ2లో యూకో బ్యాంక్ మొత్తం వ్యాపారం 13 శాతం పెరిగి రూ. 5.37 లక్షల కోట్లకు చేరింది. మొత్తం రుణాలు 16.67 శాతం వృద్ధి చెంది రూ. 1.98 లక్షల కోట్ల నుంచి రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి.