HDFC Bank Q4 Results: Profit Jumps 23 Percent YoY To Rs 10,055 Crore] - Sakshi
Sakshi News home page

HDFC Bank Q4 Results: అంచనాలకు మించి..! దుమ్మురేపిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్...! ఏకంగా...

Apr 17 2022 11:39 AM | Updated on Apr 17 2022 1:31 PM

HDFC BANK QR RESULTS - Sakshi

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అంచనాలకు మించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆదరగొట్టింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం  నాలుగో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 22.8 శాతం మేర నికర లాభాలను రికార్డు చేసింది.ఈ సంవత్సరం జనవరి-ఫిబ్రవరి-మార్చ్ మధ్యకాలానికి 10,055.2 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించింది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే నికర లాభాలు మెరుగుపడ్డాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ  8,186.5 కోట్లను నమోదు చేసింది. ఈ ఏడాదిలో నాలుగో త్రైమాసికంలో రూ. 10,055.2 కోట్ల లాభాలనుపొందింది.

గత ఆర్థిక సంవత్సరం  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర ఆదాయం 36,961.3 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంతో  పోలిస్తే.. 18.8 శాతం అధికంగా లాభాలను పొందింది.. చివరి త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలోనూ పెరుగుదల కనిపించింది. ఇక చివరి త్రైమాసికంలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 563 బ్రాంచీలతో..7,167 మందికి ఉద్యోగావకాశాలను అందించింది.

Advertisement
 
Advertisement
Advertisement