చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్‌.. పన్నెండు వేల కోట్లు హాంఫట్‌!

Hackers Steal 611 Million Dollars In Various Cryptocurrencies  - Sakshi

డీసెంట్రలైజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కి భారీ షాక్‌ తగిలింది. సరికొత్త ట్రేడింగ్‌గా ట్రెండ్‌ అవుతోన్న క్రిప్టోకరెన్సీ వ్యవస్థ కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్‌ను హ్యాకర్లు చేధించారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. 

12 వేల కోట్లు
పాలిగాన్‌ బ్లాక్‌చైయిన్‌ టెక్నాలజీపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వేల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్‌ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ అందించే పాలినెట్‌వర్క్‌ యాప్‌ను హ్యాక్‌ చేశారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న  సమాచారం ప్రకారం పాలినెట్‌వర్క్‌ నుంచి  ఈథేరమ్‌కి సంబంధించి 273 మిలియన్‌ టోకెన్లు, బినాన్స్‌ స్మార్ట్‌ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 85 మిలియన్ల యూఎస్‌ డాలర్‌ కాయిన్లు, 33 మిలియన్ల విలువైన స్టేబుల్‌ కాయిన్లను స్వాహా చేశారు. మొత్తంగా 611 మిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని తస్కరించారు. ఇండియన్‌ కరెన్సీలో ఇది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సమానం.

తిరిగి ఇచ్చేయండి
బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని క్రాక్‌ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్లకు డీఫై యాప్‌ అయిన పాలినెట్‌వర్క్‌ టీమ్‌ లేఖ రాసింది. ఇందులో హ్యాకింగ్‌లో దోచేసిన సొత్తును తిరిగి ఇచ్చేయ్సాలిందిగా విజ్ఞప్తి చేసింది. డీ సెంట్రలైజ్డ్‌ ఫైనాన్స్‌ వ్యవస్థకు సంబంధించి మీరు కొట్టేసిన డబ్బు అతి పెద్దదని పేర్కొంది. ఇంత పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పిడన వారు తర్వాత పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మీరు కొట్టేసిన సొమ్మును తిరిగి వినియోంచుకోలేరని సూచించింది. 

డీఫై  యాప్‌
సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్‌ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్‌డ్‌ ఫైనాన్స్‌ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్‌ చెయిన్‌ అనే ఆర్టిఫీయల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్‌ అంటే డీ సెంట్రలైజ్డ్‌ యాప్‌ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్‌ డీఫై యాప్‌ హ్యాకింగ్‌కి గురైంది. 

భిన్నాభిప్రాయాలు
పాలినెట్‌వర్క్‌ హ్యాకింగ్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటువంటి ఆర్థిక నేరాలను అరికట్టేందుకే రూల్స్‌, రెగ్యులేషన్స్‌ ఏర్పాటు చేశారని, వాటని కాదని ముందుకు వెళితే ఇలాగే జరగుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీని క్రాక్‌ చేయడం అంత ఈజీ కాదని, హ్యాకర​​​​​‍్ల మేథస్సు హ్యాట్సాఫ్‌ అంటున్నారు. ఇక హ్యాక్‌ చేసిన క్రిప్టో కరెన్సీతో పెద్దగా ప్రయోజనం ఉండదని ఇంకొందరి అభిప్రాయంగా వ్యక్తమైంది. హ్యాక్‌ చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తే... హ్యాకర్లను శిక్షించకుండా ఉద్యోగం ఇవ్వాలన్న వారూ ఉన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top