ప్రపంచ బిలియనీర్స్‌లో మరో భారతీయుడు

Guatam Adani Now One Of  WorldsTop 20 Billionaires - Sakshi

న్యూఢిల్లీ:  ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీకి చోటు దక్కింది.  తాజాగా ప్రకటించిన జాబితాలో అదానీకి టాప్‌-20లో స్థానం లభించింది. అదానీ గ్రూపుకు చెందిన వివిధ రంగాల షేర్లు ఈ ఏడాది(2021)లో అమాంతం పెరగడంతో అతని సంపదన కూడా అదే రీతిన పెరిగింది. ఫలితంగా  టాప్‌ 20లో స్థానం దక్కించుకున్న రెండో భారతీయునిగా తన పేరుని నమోదు చేసుకున్నాడు. రిలయన్స్ సంస్థ అధినేత‌ ముఖేష్‌‌‌ అంబానీ తరువాత టాప్‌-20లో చోటు దక్కించుకున్న రెండో భారతీయునిగా ఆయన గుర్తింపు పొందారు.

అదానీ గ్రూపుకు ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు, పవర్‌ ప్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి. ఇటీవల సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్‌ అడుగుపెట్టింది. ఈ సంవత్సరం అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 96 పెరిగితే ప్రధానమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 90 శాతం పురోగతి సాధించింది. ఇలా పలు రంగాలల్లో ఆయన రాణిస్తున్నారు. ఇక  2020లో 16.2 బిలియన్‌ డాలర్లగా ఉండే అదానీ సంపద ప్రస్తుతం 59 బిలియన్ల డాలర్లకు చేరింది.

ఇటీవలే ఎలన్‌ మస్క్‌, జెఫ్ బెజోస్‌ కంటే అదానీ 2021లో ఎక్కువ సంపాదించిన వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..అదానీ నికర విలువ 2021లో 16.2 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనితో ఈ ఏడాదిలో అత్యధికంగా సంపాదించే వ్యక్తిగా నిలిచారు. అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఒకటి మినహా మిగిలిన అన్నీ షేర్ల ధరలు 50 శాతం మేర పెరగడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది.

( చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్ ) 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top