రూ.9,395 కోట్ల షేర్ల విక్రయం.. ఐటీసీ బ్లాక్‌డీల్‌ | GQG Partners Sells ITC Stake Rs 9,395 Crore | Sakshi
Sakshi News home page

రూ.9,395 కోట్ల షేర్ల విక్రయం.. ఐటీసీ బ్లాక్‌డీల్‌

Oct 10 2026 1:59 PM | Updated on Oct 10 2026 2:33 PM

GQG Partners Sells ITC Stake Rs 9,395 Crore

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ, డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీలో తాజాగా జీక్యూజీ పార్ట్‌నర్స్‌ 2.91 శాతం వాటా విక్రయించింది. బీఎస్‌ఈ బ్లాక్‌డీల్స్‌  ప్రకారం 14 దశలలో మొత్తం 36.5 కోట్ల షేర్లను విక్రయించింది. ఒక్కో షేరుకీ రూ. 257.35 ధరలో 2.91% వాటా అమ్మివేసింది. తద్వారా రూ. 9,395 కోట్లకుపైగా అందుకుంది.

మరోపక్క యూకే ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ అలియెన్స్‌ విటన్‌ 16.11 లక్షల ఐటీసీ షేర్లను రూ. 41.5 కోట్లకు విక్రయించింది. బీఎస్‌ఈ షేర్‌ హోల్డింగ్‌ వివరాల ప్రకారం 2026 జూన్‌ చివరికల్లా ఐటీసీలో జీక్యూజీ 1.06% వాటా కలిగి ఉంది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ ట్రస్ట్‌–2, గోల్డ్‌మన్‌ శాక్స్‌ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ ఇంటర్నేషనల్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ వద్ద మరో 2.06% వాటా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement