ఐపీఓకి ముందు ఎల్‌ఐసీ కీలక నిర్ణయం..!

Government Extends IPO Bound LIC Chairmans Tenure By A Year - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ భీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ త్వరలో ఐపీఓకి వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి కీలక సమయంలో సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) చైర్మన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ పదవీకాలాన్ని కూడా ప్రభుత్వం ఒక సంవత్సరం పొడిగించింది. ఈ పొడిగింపుతో ఎం.ఆర్. కుమార్ 2023 మార్చి వరకు ఛైర్మన్‌ హోదాలో కొనసాగనున్నారు. 

ఎల్‌ఐసీ వైర్మన్‌ పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. గత ఏడాది జూన్‌లోనూ ఎం.ఆర్‌.కుమార్‌కు 9 నెలల పొడిగింపునిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐపీఓకి వచ్చేందుకు ఎల్‌ఐసీ సిద్దం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రక్రియ సాఫీగా సాగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎల్‌ఐసీ ఐపీఓకి వీలుగా లైఫ్‌ ఇన్ఫూరెన్స్‌ కార్పొరేషన్‌ చట్టానికి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్పులు చేసింది. అవన్నీ గత ఏడాది జూన్‌ 30 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎల్‌ఐసీ ఐపీఓలో జాబితా చేసిన తర్వాత రూ.8-10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువతో దేశంలో అతిపెద్ద సంస్థగా మారే అవకాశం ఉంది. 

(చదవండి: వామ్మో! సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్ విలువ ఇన్ని కోట్లా..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top