Google: గూగుల్‌లో సూపర్‌ ఫీచర్‌, ఇక ఇంగ్లీష్‌లో అదరగొట్టేయొచ్చు

Google Search Introduces New Feature For Teach English Word Every Day - Sakshi

ఇంగ్లీష్‌..! ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన లాంగ్వేజ్‌. ఎడ్యుకేషన్‌ లేకపోయినా, డిగ్రీలు చదవకపోయినా ఇంగ్లీష్‌ మాట్లాడడం, చదవడం, రాయడం వస్తే చాలు అవకాశాలు దానంతటే అవే మనల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. అందుకే ఇంగ్లీష్‌ నేర్పించేందుకు ఇనిస్టిట్యూట్‌లు, యాప్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ సైతం యూజర్లకు ఉచితంగా ఇంగ్లీష్‌ నేర్పించేందుకు సిద్ధమైంది. 

ఇంగ్లీష్‌ నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు ఇంగ్లీష్‌ ల్వాంగేజ్‌ను నేర్పించాలనే ఉద్దేశంతో గూగుల్‌ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ సాయంతో  ప్రతిరోజూ కొత్త ఇంగ్లీష్‌ అర్ధాన్ని నేర్చుకోవచ్చు. యూజర్లు తమ ఫోన్‌లలో ఈ ఫీచర్‌ను యాక్టివేషన్‌ చేసుకుంటే గూగుల్‌ ప్రతిరోజూ ఒక కొత్త అర్ధాన్ని నేర్పిస్తుంది. ఇందుకోసం సెర్చ్‌ ఇంజిన్‌ ఇంగ్లీష్‌లో ప్రావీణ్యులైన అధ్యాపకుల్ని నియమించినట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. తద్వారా ఇంగ్లీష్‌ భాషపై పట్టుసాధించవచ్చని గూగుల్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. 

ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్‌ ప్రకారం..ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో గూగుల్‌ ట్రెండ్స్‌లోని టాప్‌ సెర్చ్‌లో కొన్ని ఇంగ్లీష్‌ అర్ధాల్ని తెలుసుకునేందుకు ఎక్కువగా సెర్చ్‌ చేసినట్లు గూగుల్‌ తెలిపింది. వాటిలో ఇంట్రోవర్ట్‌, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉన్నాయని, అందుకే యూజర్ల రోజూవారి జీవితాల్లో అవసరమైన ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్‌ వెల్లడించింది. 

గూగుల్‌ ఫీచర్‌ను ఎలా యాక్టీవ్‌ చేసుకోవాలి


గూగుల్‌ క్రోమ్‌ ఓపెన్‌ చేయాలి. ఓపెన్‌ చేసిన తరువాత సెర్చ్‌బార్‌లో ఉదాహరణకు ఇంటిగ్రిటీ అనే పదం అర్ధం తెలుసుకోవాలని ఉంటే..ముందుగా define అని టైప్‌ చేయాలి. ఆ వర్డ్‌ పక్కనే ఇంటిగ్రిటీ (define integrity) అని టైప్‌ చేస్తే ఆ పదం అర్ధం వస్తుంది. పైన ఇమేజ్‌లో చూపించినట్లుగా సెర్చ్‌ బార్‌ పక్కనే బెల్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. దాన్ని మీరు యాక్టివేషన్‌ చేసుకుంటే గూగుల్‌ ప్రతిరోజు ఓ కొత్త అర్ధాన్ని నేర్పించేలా మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌ పంపిస్తుంది.
చదవండి: Facebook: పేరు మారిస్తే ఫేస్‌బుక్‌ ఇమేజ్‌ దెబ్బతినదా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top