Facebook Name Change: పేరు మార్చడం అంత ఈజీనా? మరి ఆ కంపెనీల సంగతి ఏంది?

Rename Facebook Some Companies Change Their Name Before FB - Sakshi

Facebook Change Name: వరుస వివాదాలు, విమర్శల నడుమే పేరు మార్చుకోబోతున్నట్లు ఉప్పందించింది ఫేస్‌బుక్‌. ఇంటర్నెట్‌లో సంచనాలకు నెలవైన ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌.. ఉన్నట్లుండి పేరు మార్చుకోవడం గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అంతపెద్ద కంపెనీ సడన్‌గా పేరు మార్చుకుంటే చిక్కులు ఎదురుకావా? వ్యాపారానికి, గ్లోబల్‌ మార్కెట్‌కి ఇబ్బందులు ఏర్పడవా? అనే  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పేరు మార్చుకోవడం ద్వారా ఫేస్‌బుక్‌కు టెక్నికల్‌గానే కాదు.. లీగల్‌గానూ ఎలాంటి సమస్యలు ఎదురు కావని చెప్తున్నారు నిపుణులు.

టెక్‌ దిగ్గజాలు ఆల్ఫాబెట్‌ (గూగుల్‌), స్నాప్‌ఛాట్‌(స్నాప్‌ ఐఎన్‌సీ), యాపిల్‌ కంప్యూటర్‌(యాపిల్‌)గా పేర్లు మార్చేసినవే. ఇప్పుడు ఫేస్‌బుక్‌ ఐఎన్‌సీ(కంపెనీ) మార్చేసినా ఎలాంటి ప్రభావం ఉండబోదు.  

సోషల్‌ మీడియా దిగ్గజంగా పేరున్న ఫేస్‌బుక్‌ను ప్రపంచం మొత్తంలో 30 శాతం మంది ఉపయోగిస్తున్నారనేది అంచనా. 

ఫేస్‌బుక్‌ కంపెనీ నుంచి ఫేస్‌బుక్‌ యాప్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఓక్యూలస్‌.. ఇవేగాక మరికొన్ని మిస్టీరియస్‌ ప్రాజెక్టులు ఫేస్‌బుక్‌ కింద పని చేస్తున్నాయి. ఇక మెటావర్స్‌ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపడుతున్న నేపథ్యంలోనే పేరును మార్చేయాలని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ నిర్ణయించుకున్నాడని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. 

ఫేస్‌బుక్‌ కంటే ముందు..  చాలా ఏళ్లుగా కంపెనీలెన్నో తమ పేర్లు మార్చేసుకున్నాయి. వాటికి కారణాలూ ఉన్నాయి.

సిగరెట్‌ కంపెనీ ఫిలిప్‌ మోరిస్‌ తనపై పడ్డ బ్యాడ్‌ మార్క్‌ను చెరిపేసుకునేందుకు 2003లో ఆల్‌ట్రియా గ్రూప్‌గా మార్చుకుంది. 

పెప్సికో రెస్టారెంట్‌ విభాగంలో టాకో బెల్‌, పిజ్జా హట్‌, కేఎఫ్‌సీలాంటివి ఉన్నాయి. అయితే రెస్టారెంట్‌ రంగంలో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో వీటన్నింటికి కలిపి ‘యమ్‌!’ కిందకు తీసుకొచ్చింది పెప్సీకో.

ప్రజల్లో మంచి మార్కుల కోసం.. వీటి నుంచి తప్పించుకునేందుకు కూడా కంపెనీలు పేరు మార్చుకున్న దాఖలాలు ఉన్నాయి. కెన్‌టూకీ ఫ్రైడ్‌ చికెన్‌ను ‘ఫ్రైడ్‌’ పదం మంచిదికాదనే ఉద్దేశంతో..  షార్ట్‌ కట్‌లో కేఎఫ్‌సీగా, సుగర్‌పాప్స్‌లో షుగర్‌ ఉందని ‘కార్న్‌ పాప్స్‌’గా, ది చైనీస్‌ గూస్‌బెర్రీ కాస్త ది కివీగా మారిపోయాయి. 

న్యాయపరమైన చిక్కులతోనూ కంపెనీలు పేర్లు మార్చుకున్నాయి. ఆండర్‌సన్‌ కన్సల్టింగ్‌.. యాసెంచర్‌గా పేరు మార్చుకుంది. 

తాజాదనం కోసం.. ఫెడరల్‌ ఎక్స్‌ప్రెస్‌ తన పేరును ఫెడ్‌ఎక్స్‌గా మార్చేసుకుంది. 

పేరు మార్చడమంటే ఆఫీసుల్లో రౌండ్‌ టేబుల్‌ మీద అంతా కూర్చుని పేర్లు రాసుకుని.. బెస్ట్‌ పేరుకు ఓటేయడం కాదంటారు లారెన్‌ సుట్టన్‌. కంపెనీల పేర్లు మార్చే ప్రక్రియకు దీర్ఘకాలికంగా నడిచిన రోజులు ఉన్నాయని, పేర్లు మార్చడం కోసం కంపెనీలకు ఖర్చు కూడా తడిసి మోపెడు అవుతుందని చెప్తున్నారు. క్యాచ్‌వర్డ్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడైన లారెన్‌.. ఆసానా, ఫిట్‌బిట్‌​, ఇంటెల్‌, అప్‌వర్క్‌ పేర్లను ప్రతిపాదించారు కూడా. 

‘‘కంపెనీలకు సరిపోయే పేరు పెట్టడం పెద్ద సమస్య. కొత్త పేరు కంపెనీ లక్క్క్ష్యాన్ని ప్రతిబింబించేదిలా ఉండాలి.  ఇక ఫేస్‌బుక్‌ లాంటి కంపెనీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తోంది. కాబట్టి, ట్రేడ్‌ మార్క్స్‌ పరంగా న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చూసుకోవాలి. అలాగే ఆ పేరు వెబ్‌ డొమైన్స్‌లో అందుబాటులో ఉండాలి అని చెప్తున్నారు లారెన్‌ సుట్టన్‌.

ఫేస్‌బుక్‌ ఎందుకు మార్చాలనుకుంటోంది అనే దానిపై విశ్లేషకుల సమీక్ష మొదలైంది. కేవలం సోషల్‌ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్‌గా మొదలై.. పేరెంట్‌ కంపెనీగా వాట్సాప్‌,ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి మోస్ట్‌ యూజర్‌ యాప్స్‌ను తన కింద నడిపిస్తోంది ఫేస్‌బుక్‌. అయితే ఈమధ్యకాలంలో వివాదాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి యాప్స్‌ను డీల్‌ చేయడంలో యూజర్‌ భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తుందనే ఆరోపణ..  కంపెనీ(ఫేస్‌బుక్‌) పేరు ఘోరంగా బద్నాం అయ్యింది.

ఈ తరుణంలోనే పేరు మార్చేయడం ద్వారా కొంతలో కొంత డ్యామేజ్‌ కంట్రోల్‌ చేయాలని ఫేస్‌బుక్‌ కంపెనీ భావిస్తుండొచ్చని ఆంటోనీ షోర్‌ చెప్తున్నారు. అడోడ్‌ లైట్‌రూం, క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌, యాసెంచర్‌లకు పేర్లు పెట్టింది ఈ టెక్‌ మేధావే. ‘‘గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ ఆల్ఫాబెట్‌. ఈ విషయం చాలా కొద్దిమందికే తెలుసు. యూజర్లకు, సాధారణ ప్రజలకు పేరెంట్‌ కంపెనీ గురించి పెద్దగా పని లేదు. ఆ అవసరం కేవలం ఇన్వెస్టర్లకు, ఫైనాన్షియల్‌ ఆడియొన్స్‌కు ఉంటే సరిపోతుంది. అలాంటప్పుడు ఫేస్‌బుక్‌ పేరు మార్పు పెద్ద సమస్య కాదని ఆంటోనీ షోర్‌ అంటున్నారు.

చదవండి: పేరు మార్చుకోనున్న ఫేస్‌బుక్‌? కారణాలు ఏంటంటే..

చదవండి: Facebook: ఫేస్‌బుక్‌ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top