Facebook: ఫేస్‌బుక్‌ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...!

Facebook Renaming Report Sparks Industry Guesses - Sakshi

ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కంపెనీ పేరును మార్చనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నెట్టింట్లో ఫేస్‌బుక్‌ పేరు మార్పుపై నెటిజన్లు రకరకాలుగా గెస్‌ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ కొత్త పేరు ఇదేనంటూ నెటిజన్లు గోలగోల చేస్తున్నారు.  

కొత్తపేరు ఇదేనంటూ.. 
ఫేస్‌బుక్‌ కంపెనీ పేరును మార్చనున్నట్లు తెలియడంతో నెటిజన్లు ట్విటర్‌లో పలు సూచనలను చేస్తున్నారు. వీరిలో సామాన్య నెటిజన్లే కాకుండా టెక్‌ ఇండస్ట్రీ దిగ్గజ వ్యక్తులు కూడా  ఉండడం విశేషం. కొంత మంది నెటిజన్లు ఎఫ్‌బీ(FB)గా పేరు పెట్టాలంటూ సూచనలు చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు మేటా(Meta),  హరిజన్‌ (Horizon),ది ఫేస్‌బుక్‌ అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరోవైపు ఫేస్‌బుక్‌ మాజీ సివిక్‌ ఛీఫ్‌ సమిద్‌ చక్రవర్తి ఒక అడుగు ముందుకేసి ఫేస్‌బుక్‌ను ‘మెటా’ పేరుతో మారుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మరికొద్ది రోజుల్లోనే ఫేస్‌బుక్‌ మెటావర్స్‌ను రిలీజ్‌ చేస్తున్న తరుణంలో ఫేస్‌బుక్‌ కొత్త పేరు మెటా అయి ఉండోచ్చనే భావన అందరిలో వస్తోంది. ఇదిలా ఉండగా..ఈ నెల అక్టోబర్‌ 28 లోపే ఫేస్‌బుక్‌ కొత్త పేరును ప్రకటించనుంది. 

వరుస ఆరోపణలను ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌..!   
గత కొద్ది రోజుల నుంచి ఫేస్‌బుక్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫేస్‌బుక్‌ కొంతమంది వ్యక్తుల కోసమే పనిచేస్తుదంటూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఫేస్‌బుక్‌పై దుమ్మెతి పోసింది. కొంత మంది వీఐపీల ప్రైవసీ విషయంలో ఫేస్‌బుక్‌ వారిని అందలాలను ఎక్కిస్తోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆరోపణలు చేసింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఒక్కటే కాదు ఫ్రాన్సెస్‌ హాగెన్‌ అనే మాజీ ఉద్యోగిని కూడా ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలను చేసింది. ఫేస్‌బుక్‌ దృష్టిలో యూజర్ల‘భద్రత కంటే లాభాలే ముఖ్యం’ అంటూ యూఎస్‌ కాంగ్రెస్‌ వేదికగా పలు సంచలన రహస్య పత్రాలను బయటపెట్టిన విషయం తెలిసిందే.

చదవండి: టీవీ ప్రేక్షకులకు షాకింగ్‌ న్యూస్‌...!వారికి మాత్రం పండగే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top