గూగుల్‌ సెర్చ్‌లో పిల్లల ఫొటోలు! పేరెంట్స్‌ ఇది మీ కోసమే..

Google Ready To Remove Under 18 Images On Image Search - Sakshi

గూగుల్‌ సెర్చ్‌ బార్‌లో ఓసారి మీ పేరు టైప్‌ చేసి చూడండి. గూగుల్‌ ఇమేజ్‌ల్లో మీ ఫొటో కనిపించే అవకాశం లేకపోలేదు. సోషల్‌ మీడియా కనెక్టివిటీ అయితేనేం..  ట్యాగ్‌ చేసినవి అయితేనేం.. రివెంజ్‌తో అప్‌లోడ్‌ చేసేవి అయితేనేం.. ఇతరత్ర డేటా వల్ల అయితేనేం.. గూగుల్‌లో మన ఫొటోలు కనిపించడం షరామామూలు అయ్యింది. అయితే ఇష్టం లేకున్నా.. అభ్యంతరాలున్నా మీ ఫొటోల్ని డిలీట్‌ చేసుకునే ఛాన్స్‌ ఇస్తున్న గూగుల్‌.. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని పిల్లల కోసమూ తీసుకురాబోతోంది. 

ఈ మధ్య కాలంలో పిల్లలు స్మార్ట్ ఫోన్‌ వాడకం సర్వసాధారణం అయ్యింది. ఈ తరుణంలో 13-18 ఏళ్లలోపు వయసున్న పిల్లల కోసం ఈ కొత్త పాలసీని తీసుకొచ్చింది గూగుల్‌. 18 ఏళ్లలోపు యూజర్లుగానీ, వాళ్ల తల్లిదండ్రుల విజ్ఞప్తి మీద గూగుల్‌ ఇమేజెస్‌లో కనిపించే ఫొటోల్ని డిలీట్‌ చేసే వీలును గూగుల్‌ కల్పిస్తోంది. ఇలాంటి ఆప్షన్‌ పెద్దల కోసం ఇదివరకే ఉంది. అయితే ఈ వ్యవహారంలో అశ్లీల కంటెంట్‌, వేధింపులతో ఎక్కువగా బాధితులు అవుతోంది పిల్లలే. అందుకే ఇప్పుడు కీలక ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. ఆ ఏజ్‌ గ్రూప్‌ యూజర్లు, పేరెంట్స్‌, సంరక్షకులు ఎవరైనా సరే సంబంధిత ఫీడ్‌బ్యాక్‌ను(కారణం) చెప్పి.. ఆ ఫొటోను తొలగించొచ్చు. ఈ నెలాఖరులో ఈ సౌకర్యాన్ని తీసుకురాబోతోంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి పేరెంట్‌ గైడ్‌లైన్స్‌ వివరాలను ఉంచింది.

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోం.. ఉద్యోగులకు భారీ షాక్‌!

ఇక 13 ఏళ్లలోపు పిల్లలకు గూగుల్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకునే వెసులుబాటు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని మరోసారి స్పష్టం చేసింది టెక్‌ దిగ్గజం. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడ పెద్ద మెలిక కూడా ఉంది. గూగుల్‌ తన ఇమేజ్‌ సెర్చ్‌ ఇంజిన్‌ నుంచి మాత్రమే ఫొటోను తొలగిస్తామని స్పష్టత ఇచ్చింది. అంటే.. గూగుల్‌ ఇమేజ్‌ల నుంచి ఫొటో పోయినా.. ఇంటర్నెట్‌ డేటా(మిగతా వెబ్‌ బ్రౌజర్ల) నుంచి మాత్రం ఆ ఫొటో పోతుందన్న గ్యారెంటీ లేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top