గూగుల్ మ్యాప్స్ లో 'గో' టాబ్ ఫీచర్ 

Google Maps Getting a New Go Tab Feature - Sakshi

గూగుల్ మ్యాప్స్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా మరో ఫీచర్ని తీసుకొచ్చింది. వినియోగదారులు గతంలో సందర్శించిన ప్రదేశాలకు సులభంగా నావిగేట్ చెయ్యడానికి గూగుల్ మ్యాప్స్ త్వరలో కొత్తగా 'గో' టాబ్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా మనం తరుచుగా వెళ్లే షాపింగ్ మాల్స్, స్కూల్స్, జిమ్ వంటి ప్రదేశాలను పిన్ చేసుకోవచ్చు. రోజు వెళ్లే దారిలో ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత సమయం పడుతుంది వంటి విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ రాబోయే కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్ మరియు ఐఓస్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.(చదవండి: 2021లో రానున్న ఆపిల్ ఎమ్‌2 ప్రాసెసర్)

ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ లో ఇల్లు, పని చేసే ప్రదేశాలను మాత్రమే సేవ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. త్వరలో రాబోయే కొత్త ఫీచర్ ద్వారా మనం తరుచుగా వెళ్లే ప్రదేశాలను జోడించుకోవచ్చు. వినియోగదారులు ప్రతిసారి ఈ ప్రదేశాల కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ ద్వారా మన వ్యక్తిగత వాహనాలలో, ప్రజా రవాణాలలో ప్రయాణం చేసినప్పుడు ఏ రూట్ లో ప్రయాణిస్తే తొందరగా గమ్యానికి చేరుకుంటామో తెలియజేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌ప్లోర్, సేవ్డ్‌ ట్యాబ్స్‌ ఫీచర్‌ స్థానంలో ఇక మీదట గో ట్యాబ్ అందుబాటులోకి రానుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top