2021లో రానున్న ఆపిల్ ఎమ్‌2 ప్రాసెసర్ | Sakshi
Sakshi News home page

2021లో రానున్న ఆపిల్ ఎమ్‌2 ప్రాసెసర్

Published Mon, Dec 7 2020 6:52 PM

Apple Silicon M2 Powered MacBook Pro Tipped For 2021 Launch - Sakshi

ఆపిల్ కంపెనీ ఇటీవలే సిలికాన్‌ ఎమ్‌1 ప్రాసెసర్‌తో మూడు మ్యాక్ కంప్యూటర్లను విడుదల చేసింది. దీంతో సంప్రదాయ ఇంటెల్‌ ప్రాసెసర్‌లకు స్వస్తి పలికింది. ఆపిల్ కంపెనీ మాక్ కోసం కొత్తగా సిలికాన్‌ ఎమ్‌1 ప్రాసెసర్ లను రూపొందించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 2021లో రాబోయే కొత్త 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో,16-అంగుళాల మాక్‌బుక్ ప్రోలో సిలికాన్‌ ఎమ్‌2 ప్రాసెసర్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎమ్‌1 ప్రాసెసర్‌తో వచ్చిన కొత్త ల్యాప్‌టాప్‌లు పనితీరు, బ్యాటరీ విషయంలో ఇతర ల్యాప్‌టాప్‌ల కంటే మెరుగైన పనితీరును ప్రదర్శించాయి అని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంస్థ త్వరలో కొత్త మాక్‌బుక్ మరియు ఐమాక్ పరికరాలలో కొత్త ఆపిల్ సిలికాన్ ఎమ్‌2 ప్రాసెసర్‌తో తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఆపిల్‌ 2021లో కొత్త డిజైన్‌తో మ్యాక్‌బుక్‌ ప్రొ మోడల్స్‌ని విడుదల చేయనుందట. అలానే 2022లో మిని-ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో మ్యాక్‌బుక్ ఎయిర్‌, మ్యాక్‌బుక్ ప్రొ, మ్యాక్‌బుక్‌ ల్యాప్‌టాప్‌లను యాపిల్‌ విడుదల చేస్తుందని సమాచారం. ఎఆర్ఎం ఎమ్1 చిప్ 5నానోమీటర్ పై బిల్డ్ చేయబడింది. కొత్త ఎమ్2 ప్రాసెసర్ ఎమ్1 ప్రాసెసర్ కు కొనసాగింపుగా రాబోతుంది. ఎమ్1 చిప్ లో శక్తివంతమైన 8-కోర్ సీపీయూ ఉంది. ఈ చిప్ మునుపటి తరం ప్రాసెసర్ల కంటే 3.5x వేగంగా మరియు 5x వేగవంతమైన జీపీయు పనితీరును ప్రదర్శిస్తుంది. ఆపిల్ సిలికాన్ ఎం1 చిప్‌సెట్‌లు న్యూరల్ ఇంజిన్ వంటి టెక్నాలజీ సహాయంతో రూపొందించబడ్డాయి. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement