యాపిల్‌పై గూగుల్‌ సంచలన ఆరోపణలు

Google Lashes Out Apple Over iMessage Green Bubble Bullying - Sakshi

టెక్‌ దిగ్గజ కంపెనీలు పరస్పర ఆరోపణలతో మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. యాపిల్‌ మెసేజింగ్‌ సర్వీస్‌..  ఐమెసేజ్‌ విషయంలో యూత్‌ యూజర్లు ఆందోళన చెందుతున్నారట. అందుకు కారణం.. 

ఐఫోన్‌ యూజర్లు.. ఐమెసేజ్‌ ఉపయోగించి మెసేజ్‌లు పంపించుకున్నప్పుడు బ్లూ కలర్‌లో మెసేజ్‌లు చూపిస్తున్నాయి. అదే గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి రిసీవ్‌ చేసుకున్నప్పుడు మాత్రం గ్రీన్‌ కలర్‌ నోటిఫికేషన్‌ కనిపిస్తోంది. ఇది యూజర్లను ఇబ్బందికి గురి చేస్తోందట!.

ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్.. డజన్ల మంది టీనేజర్లను, కాలేజీ స్టూడెంట్లను ప్రశ్నించి.. వాళ్ల అభిప్రాయాల ఆధారంగా ఓ కథనం ప్రచురించింది. వాళ్లలో చాలామంది ఈ ఆప్షన్‌పై ఇబ్బందిగా ఫీలవ్వడం విశేషం. మరోవైపు ఈ ఫీచర్‌పై గూగుల్‌ సైతం మండిపడింది. పోటీతత్వం పేరుతో భిన్నత్వం ప్రదర్శించడం, యువత మానసిక స్థితిని యాపిల్‌ దెబ్బ తీస్తోందని గూగుల్‌ ఆరోపణలు గుప్పించింది. 

అయితే యాపిల్‌ ఈ ఆరోపణల్ని ఓపెన్‌గా ఖండించకపోయినా.. ఓ ప్రకటనలో అదేం లేదని పేర్కొంది. ఇదిలా ఉంటే..  కిందటి ఏడాది యాపిల్‌.. ఎపిక్‌ గేమ్స్‌ కేసు సందర్భంగా.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఐమెసేజ్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంచాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ.. చివరకు ఆ ప్రతిపాదనను యాపిల్‌ మేనేజ్‌మెంట్‌ తిరస్కరించిందని తేలింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top