గూగుల్‌ మెసేజస్‌ వెబ్‌పైకి వచ్చేసింది..

Googles Messaging App Arrives On Web - Sakshi

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు పోటీగా.. గూగుల్‌ మెసేజస్‌ ప్లాట్‌ఫామ్‌ను మరింత అప్‌డేట్‌ చేసింది. తాజాగా గూగుల్‌ మెసేజస్‌ను స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే కాక, వెబ్‌ ద్వారా కూడా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఆండ్రాయిడ్‌ మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ను ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ఆవిష్కరించినట్టు గూగుల్‌ వెల్లడించింది. 

గత వారం నుంచే దీన్ని గూగుల్‌ మార్కెట్‌లోకి ఆవిష్కరించడం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వచ్చేసిందని గూగుల్‌ ప్రకటించింది. దీంతో  మీరు కంప్యూటర్ల మీద పనిచేస్తున్నప్పుడు యాప్‌తో పనిలేకుండా వెబ్‌బ్రౌజర్‌ నుంచే మీ ఫోన్‌ కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు పంపించుకోవచ్చని తెలిపింది. అయితే దీని కోసం స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఆండ్రాయిడ్‌ మెసేజస్‌ యాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంది. లేటెస్ట్‌ అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్‌ మెసేజ్‌ యాప్‌ యూజర్లు, అన్ని మెసేజ్‌లు, సంభాషణలను తమ వ్యక్తిగత కంప్యూటర్లలో యాక్సస్‌ చేసుకోవచ్చు.  ఈ ఆండ్రాయిడ్‌ మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ అచ్చం వాట్సాప్‌ వెబ్‌ మాదిరిగానే ఉంది. కాగ, వాట్సాప్‌ వెబ్‌ 2015లో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. 

ఆండ్రాయిడ్‌ మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ ఎలా ఉపయోగించాలి...

  • తొలుత ఆండ్రాయిడ్‌ మేసేజస్‌ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలి
  • అలాగే కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌లో క్రోమ్‌, ఫైర్‌బాక్స్‌, ఒపెరా, యాపిల్‌ సఫారీ బ్రౌజర్లలో ఏదో ఒకటి ఇన్‌స్టాల్‌ చేసి ఉండాలి
  • ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ మెసేజ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసుకోవాలి
  • యాప్‌ హోం పేజీలో కుడివైపు పైన కనిపించే మూడు డాట్స్‌ను క్లిక్‌ చేయాలి
  • మోర్‌ ఆప్షన్స్‌ మెనూను టాప్‌ చేసి, మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ను ఎంపిక చేసుకోవాలి
  • మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ను ఎంపిక చేసుకున్నాక వచ్చిన పేజీలో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకోవాలి
  • పేజీ లోడ్‌ అయ్యాక, మీరు మెసేజ్‌లు చూసుకోవచ్చు, సెండ్‌ చేసుకోవచ్చు. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top