ఆండ్రాయిడ్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌..! ఇకపై ఐఫోన్ల నుంచి సులువుగా..!

Android phones are finally getting iPhone-friendly message reactions - Sakshi

ఆండ్రాయిడ్‌ యూజర్లకు టెక్‌ దిగ్గజం గూగుల్ త్వరలోనే శుభవార్తను అందించనుంది. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు మధ్య టెక్స్ట్‌ సందేశాలను మరింత సులభతరం చేయడానికి గూగుల్‌ ప్రయత్నిస్తోంది.

ఐఫోన్ యూజర్లతో చాట్ చేయడం అనేది ఆండ్రాయిడ్ యూజర్లకు ఎల్లప్పుడూ సవాలే.దీనికి కారణం సదరు ఆండ్రాయిడ్‌ యూజర్‌ ఐఫోన్‌ యూజర్‌కు పంపిన స్టికర్స్‌, ఎమోజీలను వారి సందేశాలలో చూపలేదు. టెక్స్ట్‌ మెసేజ్స్‌లో పంపే ఎమోజీ, స్టికర్స్‌ను కేవలం గూగుల్‌ మెసేజ్స్‌ యూజర్లు మాత్రమే చూడగలరు. ఇక ఐఫోన్‌ ఐమెసేజ్స్‌ ద్వారా పంపినా ఎమోజీ, స్టికర్స్‌కు బదులుగా టెక్స్ట్‌ మెసేజ్‌లు ఆండ్రాయిడ్‌ యూజర్లకు కన్పించేవి. దీన్ని పరిష్కరించడానికి iMessages భాగస్వామ్యంతో ఎమోజీలను గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌లో ఎమోజీలుగా చూపే కొత్త ఫీచర్‌ను గూగుల్‌ పరీక్షించడం ప్రారంభించింది.

ఈ కొత్త ఫీచర్‌లో భాగంగా iMessages నుంచి ‘హార్ట్‌’ ఎమోజీ ఇప్పుడు ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఫేస్‌ విత్‌ హార్ట్‌ ఎమోజీ వచ్చేలా గూగుల్‌ చేసింది. దీంతో iMessages నుంచి ఆండ్రాయిడ్‌ యూజర్లకు పంపే వివిధ రకాల స్టిక్కర్స్‌, ఎమోజీలు నేరుగా వచ్చేలా గూగుల్‌ పనిచేస్తోంది. కాగా   ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ ద్వారా సదరు ఐఫోన్‌ యూజర్లు ఆండ్రాయిడ్‌ యూజర్లకు పంపే అన్నీ ఎమోజీ, స్టికర్స్‌ను టెక్స్ట్‌​ మెసేజ్‌ రూపంలో కాకుండా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో వచ్చేలా గూగుల్‌ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 

చదవండి: పెను ప్రమాదంలో పలు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్స్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top