Google CEO Sundar Pichai: చిక్కుల్లో సుందర్‌ పిచాయ్‌...! అదే జరిగితే..?

Google CEO Sundar Pichai Can be Questioned in Privacy Lawsuit - Sakshi

ఇన్‌కాజినెటో (Incognito) బ్రౌజింగ్‌ విషయంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.  యూజర్ల ప్రైవసీ విషయంలో గూగుల్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. 

కోర్టు ముందుకు సుందర్‌..!
గోప్యత విషయంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను ప్రశ్నించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇన్‌కాజినెటో బ్రౌజింగ్ మోడ్  ద్వారా ఆల్ఫాబెట్.ఇంక్ యూజర్ల ఇంటర్నెట్ వినియోగాన్ని చట్టవిరుద్ధంగా ట్రాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సుందర్ పిచాయ్‌ను రెండు గంటలపాటు ప్రశ్నించాలని  కాలిఫోర్నియాలోని ఫెడరల్ జడ్జి తీర్పునిచ్చారు. జూన్ 2020లో దాఖలు చేసిన దావాలో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో యూజర్లు ప్రైవేట్ మోడ్‌కు వెళ్లినప్పడు యూజర్‌కు తెలియకుండా   ఇంటర్నెట్ వినియోగాన్ని ట్రాక్ చేసిందని ఒక వ్యక్తి గూగుల్‌ను ఆరోపించారు. 

అన్నీ తెలిసే..!
గూగుల్‌ సీఈవో సుందర్‌కు ఇన్‌కాజినెటో మోడ్‌పై వచ్చిన ఆరోపణలు ముందుగానే అతడికి తెలుసునని కోర్టులో వాదించారు. ప్రైవేట్‌ మోడ్‌లో యూజర్ల ప్రైవసీకి భంగం కల్గించేలా కంపెనీ పాల్పడిందని ఆరోపించారు.   

అవాస్తవమైనవి..!
సదరు వ్యక్తి కోర్టులో చేసిన ఆరోపణలపై గూగుల్‌ స్పందించింది. అతడు చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టానెడా రాయిటర్స్‌తో అన్నారు. ఇప్పటివరకు చేసిన ఆరోపణలపై కంపెనీ సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు

2019లో హెచ్చరించిన సుందర్‌..!
గూగుల్‌ క్రోమ్‌ ఇన్‌కాజినెటో బ్రౌజింగ్‌ విషయంలో 2019లోనే సుందర్‌ పిచాయ్‌ యూజర్లను హెచ్చరించారు. ఇన్‌కాజినెటో మోడ్‌ సమస్యాత్మకమైందని అప్పట్లో అన్నారు. ఇన్‌కాజినెటో మోడ్‌ కేవలం యూజర్ల డేటాను సేవ్‌ చేయకుండా ఆపివేస్తుందని గూగుల్‌ గతంతోనే పేర్కొంది. ఇటీవలి కాలంలో యూజర్లు  అల్ఫాబెట్‌ యూనిట్‌పై  గోప్యతా, ఆన్‌లైన్‌ నిఘాపై  ఆందోళన వ్యక్తం చేశారు.  

చదవండి: ఆండ్రాయిడ్‌ యూజర్లకు అలర్ట్‌..! ఈ యాప్స్‌ ఫోన్‌లో ఉంటే..మీ ఖాతాలు ఖాళీ..!
చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్‌ హెచ్చరిక..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top