ఆండ్రాయిడ్‌ యూజర్లకు అలర్ట్‌..! ఈ యాప్స్‌ ఫోన్‌లో ఉంటే..మీ ఖాతాలు ఖాళీ..!

Google Bans This Google Play Store App Delete HIDDEN Joker Malware From Your Phone - Sakshi

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు హెచ్చరిక. ది డేంజరస్‌ మాల్‌వేర్‌ ‘జోకర్‌’ మళ్లీ వచ్చేశాడు. దేశంలో ఇప్పటికే ఐదు లక్షల మంది ఆండ్రాయిడ్‌ యూజర్స్‌ జోకర్‌ మాల్‌వేర్‌తో లింకులు ఉన్న యాప్స్‌(సురక్షితం కానీ) ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ ప్రడియో ఒక బ్లాగ్‌  పోస్ట్‌లో వెల్లడించింది. 

జోకర్‌ మాల్‌వేర్‌.. మొదటిసారి 2017లో గూగుల్‌లో కన్పించింది. ఇది చాలా ప్రమాదకరమైన మాల్‌వేర్‌ అని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని పోయినేడాది గూగుల్‌ ప్రకటించింది. కానీ,  కిందటి ఏడాది జులైలో గూగుల్‌ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్‌ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్‌.. కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. గూగల్‌ ప్లే స్టోర్‌పై మరోసారి జోకర్‌ మాల్‌వేర్‌ విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ప్రడియో  ఒక అలర్ట్‌ జారీ చేసింది. జోకర్‌ మాల్‌వేర్‌ సుమారు పది యాప్స్‌లో ఉన్నట్లు ప్రడియో గుర్తించింది. ఈ యాప్స్‌ వెంటనే డిలీట్‌ చేయాలని ప్రడియో పేర్కొంది. ఈ యాప్స్‌ మీ స్మార్ట్‌ఫోన్లలో ఉంటే హ్యకర్లు మీ బ్యాంకు ఖాతాల్లోని​ డబ్బులను క్షణాల్లో ఊడ్చేస్తారని ప్రడియో వెల్లడించింది. 

జోకర్‌ మాల్‌వేర్‌ డిటెక్ట్‌ఐనా యాప్స్‌ ఇవే..!

  • కలర్ మెసేజ్ యాప్‌
  • సేఫ్టీ యాప్‌లాక్‌
  • కన్వీనియెంట్ స్కానర్ 2,
  • ఎమోజి వాల్‌పేపర్స్‌
  • సెపరేట్ డాక్ స్కానర్‌
  • ఫింగర్‌టిప్ గేమ్‌బాక్స్
  • ఈజీ పీడీఎఫ్ స్కానర్‌
  • సూపర్-క్లిక్ వీపీఎన్‌ యాప్‌
  • వాల్యూమ్ బూస్టర్ లౌడర్ సౌండ్ ఈక్వలైజర్
  • ఫ్లాష్‌లైట్  ఫ్లాష్‌ అలర్ట్‌ యాప్‌

చదవండి: టెస్లా కంటే తోపు కారును లాంచ్‌ చేసిన హువావే..! ఏకంగా 1000కిమీ మేర..! ప్రత్యర్థి ఆటోమొబైల్‌ కంపెనీలకు చుక్కలే..!

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top