Google Warns 2 Billion Users: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్‌ హెచ్చరిక..!

Google Warns 2 Billion Users Of Update That Could Break Websites Worldwide - Sakshi

Google Warns 2 Billion Users Of Update That Could Break Websites Worldwide: ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల క్రోమ్‌ యూజర్లకు పెనుప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గూగుల్‌ హెచ్చరించింది. రాబోయే  క్రోమ్‌ బ్రౌజర్‌ అప్‌డేట్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక వెబ్‌సైట్‌లను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్‌ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. 

అంతుచక్కని సమస్య.! పరిష్కారమే లేదు..!
టెక్ దిగ్గజం గూగుల్‌ తన క్రోమియంబగ్ ట్రాకర్ బ్లాగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాబోయే అనిశ్చితికి ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారమే లేకపోవచ్చునని  గూగుల్‌ అభిప్రాయపడింది. కాగా తన వంతుగా సమస్యను పరిష్కరించేందుకు గూగుల్‌ ప్రయత్నాలను చేస్తోనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ వెబ్‌సైట్లకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే విషయం అస్పష్టంగా ఉంది. 

అలర్ట్‌గా ఉండడమే..!
సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రోమ్ యూజర్లు ఇతర బ్రౌజర్స్‌ను వాడాలని ఫోర్బ్స్‌ తన నివేదికలో పేర్కొంది. క్రోమ్‌ యూజర్లు అలర్ట్‌గా ఉండడమే మంచిదని తెలిపింది. వచ్చే నెలలో క్రోమ్‌ యూజర్లకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

వెర్షన్స్‌తో సమస్య..!
ఫోర్భ్స్‌ ప్రకారం...గూగుల్‌ క్రోమ్‌ వెర్షన్స్‌లో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రోమ్‌ బ్రౌజర్‌ 96 వెర్షన్‌లో ఉంది.  అయితే గూగుల్‌ మరిన్ని ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ‘క్రోమ్‌ కానరీ’ బ్రౌజర్‌ను గూగుల్‌ టెస్ట్‌ చేస్తోంది. ఇది ప్రారంభ యాక్సెస్ డెవలపర్ బిల్డ్. ఇప్పుడు ఇది వెర్షన్ 99లో ఉంది. ఎప్పుడైతే బ్రౌజర్‌ వెర్షన్‌ 100కి చేరుకుంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ గ్లిచ్‌తో ప్రభావితమైన వెబ్‌సైట్‌లు స్పష్టంగా లోడ్ అవడం ఆగిపోతాయని ఫోర్బ్స్‌ పేర్కొంది. దీనికి కారణం ఈ వెబ్‌సైట్‌లు యూజర్లు సైట్‌ను సందర్శించే సమయంలో క్రోమ్ వెర్షన్‌ను తనిఖీ చేస్తాయి.  అయితే ప్రోఫెషనల్‌ వెబ్‌సైట్‌ డిజైనర్‌ డూడా వంటి డిజైన్ సాఫ్ట్‌వేర్ మొదటి రెండు అంకెలను మాత్రమే తనిఖీ చేస్తుంది. ఈ సమయంలో క్రోమ్‌ బ్రౌజర్‌ వెర్షన్‌ 100కు యాక్సెస్‌ ఉండే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయి. 

గూగుల్‌ ప్రయత్నాలు..!
ఈ గ్లిచ్ ప్రభావాలను నివారించడానికి హ్యాకింగ్‌ వంటి ప్రక్రియలతో ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు  గూగుల్‌ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఆయా వెబ్‌సైట్‌లను సందర్శించేటప్పడు వెర్షన్‌ 100 స్థానంలో రెండంకెల వెర్షన్‌ పొందేలా గూగుల్‌ ప్రయోగాలు చేస్తోంది. 

చదవండి: అమెరికా టెక్‌ దిగ్గజాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top